Home South Zone Andhra Pradesh ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లో కలకలం: అనుమానాస్పద బ్యాగ్‌పై హడావిడి |

ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లో కలకలం: అనుమానాస్పద బ్యాగ్‌పై హడావిడి |

0

ఏపీలో గంజాయి రవాణాపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. పోలీసులు, ఎక్సైజ్‌ స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ నిఘా పెంచిన క్రమంలో పల్నాడు పోలీసులు పక్కా సమాచారం ఆధారంగా ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ను ఆపి తనిఖీలు నిర్వహించారు.

ఓ బోగిలో లగేజీని చెక్‌ చేస్తుండగా చాక్లెట్‌ పేరుతో దాచిన గంజాయి ప్యాకెట్లు వెలుగులోకి వచ్చాయి.
పరీక్షించిన అధికారులు ఇవి సాధారణ చాక్లెట్లు కాకుండా గంజాయి చాక్లెట్లేనని గుర్తించారు. మొత్తం 2,000 పైచిలుకు ప్యాకెట్లు స్వాధీనం అయ్యాయి.

ఖాకీల రాకను గమనించిన దందా గ్యాంగ్ బ్యాగులు సీటు కింద వదిలేసి పారిపోయినట్లు భావిస్తున్నారు. ఈ సరుకు ఎవరి? ఎక్కడినుంచి? ఎక్కడికి? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.

NO COMMENTS

Exit mobile version