Home South Zone Telangana హైదరాబాద్ లో ఐటీ దాడుల కలకలం |

హైదరాబాద్ లో ఐటీ దాడుల కలకలం |

0

హైదరాబాద్‌లో ఐటీ అధికారులు ప్రధాన హోటళ్లపై సోదాలు నిర్వహిస్తూ కలకలం రేపుతున్నారు. పిస్తా హౌస్, షాగౌస్, మేహిఫెల్ హోటళ్ల యజమానుల ఇళ్లలోనూ తనిఖీలు సాగుతున్నాయి. మొత్తం 30 చోట్ల ఏకకాలంలో సోదాలు జరిగాయి.

అధికారుల వివరాల ప్రకారం, రికార్డుల్లో చూపిన ఆదాయం, నిజమైన ఆదాయం మధ్య వ్యత్యాసం, హవాలా, నకిలీ లావాదేవులు, అనుమానాస్పద ట్రాన్సాక్షన్‌లు గుర్తించబడ్డాయి.

రాజేంద్రనగర్లోని పిస్తా హౌస్ ఓనర్ మహమ్మద్ మజీద్ నివాసంలో నాలుగు బృందాలు సోదాలు నిర్వహిస్తున్నాయి. వర్కర్ల నివాసాలు, హార్డ్ డిస్క్ డేటా కూడా పరిశీలిస్తున్నారు.

Exit mobile version