Home South Zone Telangana స్వీకార్ ఉపకార్ పునరావాస కేంద్రంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు.|

స్వీకార్ ఉపకార్ పునరావాస కేంద్రంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు.|

0

హైదరాబాద్ : హైదరాబాద్ సీ.పి. సజ్జనర్ IPS ఆదేశానుసారం నూతన సంవత్సర సందర్భాన్ని పురస్కరించుకొని నార్త్ జోన్ డిసిపి సాధన రష్మి పెరుమాల్ IPS, ముఖ్య అతిథిగా విచ్చేసి స్వీకార్ ఉపకార్ పునరావాస కేంద్రంలో జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు.

విద్యార్థులు మరియు నిర్వాహకులతో కలిసి డిసిపి కేక్ కట్ చేసి, పండ్లను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో గోపాలపురం డివిజన్ ఏసిపి p. సుబ్బయ్య తో పాటు మారేడుపల్లి పిఎస్, ఎస్ హెచ్ ఓ నోముల వెంకటేష్, డిఐ. శ్రీశైలంనాయక్, ఎస్సై తిరుపతి మరియు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

డా.పి. హనుమంతరావు సమన్వయంతో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. ఇందులో 284 మంది విద్యార్థులు (180 మంది మూగ మరియూ చెవిటి వారు, 104మంది మానసిక వికలాంగులు) పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం హైదరాబాద్ పోలీసుల మానవీయ, స్నేహపూర్వక దృక్పధాన్ని ప్రతిబింబించింది.

#sidhumaroju.

NO COMMENTS

Exit mobile version