Home South Zone Telangana హైదరాబాద్ సి.పి. విసీ సజ్జనర్ – అర్ధరాత్రి స్వయంగస్తి.|

హైదరాబాద్ సి.పి. విసీ సజ్జనర్ – అర్ధరాత్రి స్వయంగస్తి.|

0

హైదరాబాద్ : హైద‌రాబాద్ సీపీ శ్రీ వీసీ స‌జ్జ‌న‌ర్, ఐపీఎస్ అర్థ‌రాత్రి పెట్రోలింగ్ వాహ‌నంలో స్వయంగా గస్తీ నిర్వహించారు. సైరన్, ఎలాంటి ఆర్బాటం లేకుండా ఆ వాహనంలోనే లంగ‌ర్ హౌజ్ పీఎస్ ప‌రిధిలోని ఎండీ లైన్స్, ఆశాం నగర్, డిఫెన్స్ కాలనీల్లోని రౌడీ షీటర్ల ఇళ్లకు నేరుగా వెళ్లారు. ఇంట్లోనే ఉన్న రౌడీ షీటర్లను నిద్రలేపి… వారి నేర చరిత్ర, ప్రస్తుత జీవనశైలి, ఉపాధి పరిస్థితులు, సామాజిక వ్యవహార ధోరణులపై ఆరా తీశారు.

మళ్లీ నేరాల వైపు అడుగు వేస్తే కఠిన చర్యలు తప్పవని వారిని హెచ్చరించారు. నేర ప్ర‌వృత్తి వీడి సన్మార్గంలోకి రావాల‌ని వారికి హిత‌వు ప‌లికారు.
ఆదివారం అర్ధరాత్రి సౌత్ వెస్ట్ జోన్‌లో నగర సీపీ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ ఆకస్మిక పర్యటన చేశారు. రాత్రి 12:00 గంటల నుండి 3:00 గంటల వరకు లంగర్ హౌస్, టోలిచౌకి పోలీస్ స్టేషన్ల పరిధిలోని రహదారులు, కీలక ప్రాంతాలు, సున్నితమైన పాయింట్లను ప్రత్యక్షంగా పరిశీలించారు.

టోలిచౌకి పరిధిలో రాత్రిపూట తెరిచి ఉన్న హోటళ్లు, దుకాణాలు, ఇతర వ్యాపార సంస్థల్లోకి వెళ్లారు. నిబంధనలకు విరుద్ధంగా రాత్రివేళల్లో షాపులు తెరిచి ఉంచితే కఠిన చర్యలు తీసుకుంటామని వ్యాపారులకు హెచ్చరికలు జారీ చేశారు.

పెట్రోలింగ్ సిబ్బంది ఎంత మేర అప్రమత్తంగా ఉన్నారు, రాత్రి వేళల్లో ప్రజల భద్రత కోసం ఎలాంటి చర్యలు చేపడుతున్నారు అనే అంశాలపై క్షేత్రస్థాయిలో నేరుగా ఆరా తీశారు.

విధుల్లో ఉన్న కానిస్టేబుళ్లు, అధికారులను స్వయంగా కలుసుకుని, గస్తీ పాయింట్లు, స్పందన వేగం, సమస్యల పరిష్కారంపై వివరాలు తెలుసుకున్నారు.

అనంత‌రం.. టోలిచౌకి పోలీస్ స్టేషన్‌ను సందర్శించి.. స్టేషన్ జనరల్ డైరీ, రాత్రి చేసిన ఎంట్రీలు, డ్యూటీలో ఉన్న సిబ్బంది హాజరు వివరాలు, వారికి అప్పగించిన బాధ్యతలను సమగ్రంగా పరిశీలించారు.

#Sidhumaroju

NO COMMENTS

Exit mobile version