Home South Zone Telangana మల్కాజ్ గిరి లో నూతన ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ప్రారంభం.|

మల్కాజ్ గిరి లో నూతన ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ప్రారంభం.|

0

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజ్‌గిరి ఆర్‌.కే.నగర్, శ్రీ పంచమి హోటల్ సమీపంలో కొత్తగా ఏర్పాటుచేసిన ఆల్వాల్ ఆప్కారి (ఎక్సైజ్) పోలీస్ స్టేషన్ ను మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే  మర్రి రాజశేఖర్ రెడ్డి  ముఖ్య అతిథిగా హాజరై కార్పొరేటర్లతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ.. ప్రజల భద్రత, చట్టం మరియు న్యాయం పరిరక్షణలో ఎక్సైజ్ శాఖ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. కొత్త స్టేషన్ ప్రారంభంతో అక్రమ మద్యం రవాణా, వినియోగంపై మరింత కట్టడి సాధ్యమవుతుందని తెలిపారు. ప్రజలకు సేవ చేయడంలో అధికారులు సమర్థంగా వ్యవహరించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో.. అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ముకుంద రెడ్డి, అల్వాల్–మల్కాజ్‌గిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, ఎస్‌.ఐ లు కుమార స్వామి, సంధ్య రాణి, ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ సిబ్బంది తో పాటు,     కార్పొరేటర్లు శ్రీమతి చింతల శాంతి శ్రీనివాస్ రెడ్డి, సబితా అనిల్ కిషోర్ గౌడ్, మేకల సునీత, రాము యాదవ్, మాజీ కార్పొరేటర్లు జగదీష్ గౌడ్, ఆకుల నర్సింగ్ రావు, అలాగే నాయకులు జేఏసీ వెంకన్న, మేకల రాము యాదవ్, అనిల్ కిషోర్ గౌడ్, డోలి రమేష్, అరుణ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు  పాల్గొన్నారు.

#Sidhumaroju

NO COMMENTS

Exit mobile version