Home South Zone Telangana ప్రజాహక్కుల రక్షకుడు రాజ్యాంగం: ప్రొ. కోదండరాం |

ప్రజాహక్కుల రక్షకుడు రాజ్యాంగం: ప్రొ. కోదండరాం |

0

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : దేశ సామాన్య ప్రజలకు హక్కులు అందించినది మన రాజ్యాంగమని మాజీ శాసన మండలి సభ్యులు ప్రొఫెసర్ ఎం కోదండరామ్ తెలిపారు.

బుధవారం రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఓల్డ్ ఆల్వాల్ జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
సమావేశానికి ముందు ఓల్డ్ అల్వాల్ చౌరస్తాలో ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని పూలమాలవేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా,  కోదండరాం మాట్లాడుతూ..  స్వతంత్రానికి ముందు కొందరికే హక్కులు అధికారాలు ఉన్నాయని అని చెప్పారు. స్వాతంత్రం తరువాత రాజ్యాంగం అమలులోకి వచ్చిన నాటి నుండి దేశ పౌరులందరికీ సమాన అవకాశాలు వచ్చాయని వివరించారు.

భారత రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాలు కీర్తిస్తున్నాయని రిటైర్డ్ ఐడిఏఎస్ అధికారి కె ఎస్ ఎన్ మూర్తి తెలిపారు. రాజ్యాంగ రక్షణ గురించి హక్కుల గురించి వివరించారు.

విద్యా విధానంలో ఎప్పుడు ముందుండడానికి ప్రతి విద్యార్థి కృషి చేయాలని డాక్టర్ సిద్ధూజి తెలిపారు.
రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులను చైతన్యవంతం చేయడం కోసం గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించామని గద్దర్ ఫౌండేషన్ వ్యవస్థాపక కార్యదర్శి జీ వి సూర్యకిరణ్ తెలిపారు. అల్వాల్ మండల ఆరు పాఠశాలలో 8. 9.10. తరగతుల విద్యార్థులకు భారత రాజ్యాంగం పౌర హక్కులు అంశం పైన వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేస్తున్నామని అని చెప్పారు.

ఈ సందర్భంగా మండల స్థాయిలో ముగ్గురు విద్యార్థులకు బహుమతులతో పాటు వ్యాసరచన పోటీల్లో పాల్గొన్న 54 విద్యార్థులకు బహుమతులను  అందజేశారు.

కార్యక్రమంలో అల్వాల్ మండల విద్యాశాఖ అధికారి టి. మురళీకృష్ణ , పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.
కార్యక్రమంలో నిర్వాహనకు సహకరించిన ప్రతి ఒక్కరికి గద్దర్ ఫౌండేషన్ తరపున ధన్యవాదాలు తెలిపారు.

Sidhumaroju

NO COMMENTS

Exit mobile version