Home South Zone Andhra Pradesh భవాని దీక్షల విరమణ సేవలో జిల్లా ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు |

భవాని దీక్షల విరమణ సేవలో జిల్లా ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు |

0

*భవాని దీక్ష విరమణ సేవలో జిల్లా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు
ఇంద్రకీలాద్రిలో జరుగుతున్న భవాని దీక్షల విరమణ సేవలలో 100 మంది జిల్లా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు( ఎస్ ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మేరిస్టెల్లా కళాశాల, విజయ ఇన్స్టాప్ టెక్నాలజీ ఫర్ ఉమెన్) నుంచి భవాని దీక్షల విరమణకు విచ్చేసిన భక్తులకు దేవస్థానం వారు ఏర్పాటుచేసిన సదుపాయాల మీద అభిప్రాయ సేకరణ నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ కొల్లేటి రమేష్ తెలిపారు.

దేవస్థానం అధికారుల పిలుపుమేరకు కృష్ణా యూనివర్సిటీ ఎన్టీఆర్ జిల్లా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు 11 నుంచి 15 వరకు దేవస్థానం వారు అందిస్తున్న సేవల మీద అభిప్రాయ సేకరణ నిర్వహించమని ఎన్ఎస్ఎస్ వాలంటీర్లను కోరారు అందులో భాగంగా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు భక్తులు నుంచి దేవస్థానం వారు కల్పించిన సదుపాయాల పైన భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు వాలంటీర్లు తెలిపారు.

NO COMMENTS

Exit mobile version