*ఎన్.టి.ఆర్ జిల్లా పోలీస్ కమీషనర్ వారి కార్యాలయము, విజయవాడ*
హజరత్ సయ్యద్ షా బుఖారి బాబా ఉరుసు మహోత్సవం సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించిన ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.గారు*
ఎన్.టి.ఆర్.జిల్లా, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిది, కొండపల్లి పట్టణ పరిధిలో ఈ నెల 29 వ తేదీ నుండి 31 వ తేదీ వరకు నిర్వహించు హజరత్ సయ్యద్ షా బుఖారి బాబా దర్గా 429వ ఉరుసు మహోత్సవ కార్యక్రమం సందర్బంగా ఆదిక సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న నేపధ్యంలో
కొండపల్లి మరియు పరిసర ప్రాంతాలలో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఉండేందుకు చేస్తున్న ఏర్పాట్లను ఈ రోజు నగర పోలీస్ కమీషనర్ శ్రీ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.గారు ఇతర అధికారులతో కలిసి పరిశీలించినారు.
ఈ నేపధ్యంలో ముందుగా నగర పోలీస్ కమీషనర్ శ్రీ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.గారు దర్గాలో ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. అనంతరం కొండపల్లి మరియు పరిసర ప్రాంతాలలో ఏర్పాటు చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించి అదికారులకు మరియు నిర్వాహకులకు పలు సూచనలు మరియు సలహాలను అంధించారు. పార్కింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. గంధం సమర్పించే సమయంలో భక్తుల రద్దీ దృష్ట్యా బందోబస్తు నిర్వహించే సమయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసు అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమీషనర్ గారు, పశ్చిమ జోన్ ఏ.డి.సి.పి. శ్రీ గుణ్ణం రామకృష్ణ గారు, పశ్చిమ ఏ.సి.పి. శ్రీ దుర్గారావు గారు, ఇబ్రహీంపట్నం ఇన్స్పెక్టర్ శ్రీ చంద్రశేఖర్ గారు ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
