కర్నూలు :
రోడ్డు ప్రమాదాల నివారణకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు… * ఎవరైనా మద్యం తాగి వాహనాలు నడిపితే జైలు శిక్ష తప్పదు…. కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు.రోడ్డు ప్రమాదాల నివారణకు కర్నూలు పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరం చేశారని, 2025 జనవరి నుండి డిసెంబర్ 20 వరకు 9,025 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేశారని జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు గురువారం తెలిపారు.
మద్యం తాగి వాహనం నడపడం వల్లే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని పోలీసులు పలు ప్రాంతాల్లో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఎవరైనా మద్యం తాగి వాహనాలు నడిపితే అటువంటి వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు 1 నెల రోజుల పాటు జైలు శిక్ష ఉండే విధంగా గట్టి చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ గారు తెలిపారు.
