Home South Zone Andhra Pradesh  హలో జనసేన చలో కొండగట్టు అంజన్న సన్నిధికి జనసేనని 

 హలో జనసేన చలో కొండగట్టు అంజన్న సన్నిధికి జనసేనని 

0

హలో జనసేన చలో కొండగట్టు అంజన్న సన్నిధికి జనసేనని
తేదీ 3-01-2026 అనగా శనివారం రోజున కొండగట్టు లోని శ్రీ ఆంజనేయ స్వామి వారి సన్నిధికి జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు విచ్చేయనున్నారు .

గతంలో కొండగట్టు అంజన్న స్వామిని దర్శించుకున్న సందర్భంలో  ఆలయ బోర్డ్ సభ్యులు, అధికారులు భక్తులకు సరిపడే దీక్ష విరమణ మండపాలు లేవు అని మీ తరఫున ఒక మండపాన్ని ఏర్పాటు చేయాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కోరడం జరిగింది .

శ్రీ పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణలోని కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి అంటే అపారమైన నమ్మకం ఇచ్చిన మాట ప్రకారం కంటే ఇంకా పెద్ద ఎత్తున చేయాలన్న సంకల్పంతో ఎంతో అధ్యయనం చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులుశ్రీ పవన్ కళ్యాణ్ గారు .

శ్రీ పవన్ కళ్యాణ్ గారు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు ఆధ్వర్యంలో కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో భక్తుల అవసరాల నిమిత్తం కొరకు 2000 మంది భక్తులకు సరిపడే దీక్షా విరమణ మండపం మరియు 96 గదుల సత్రం నిర్మాణానికి 35.19 కోట్ల

వ్యాయామంతో టిటిడి బోర్డు ఆధ్వర్యంలో నిధులను అమోదం చేయించినారు
జనవరి 3వ తేదీన (టీటీడీ) బోర్డు ఆధ్వర్యంలో  నిర్మాణ శంకుస్థాపన పూజ కార్యక్రమంలో పాల్గొననున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు.

పూజా కార్యక్రమాల అనంతరం శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం ఉంటుంది ఈ యొక్క కార్యం జనసేన పార్టీ నాయకులకు, వీర మహిళలకు పార్టీ శ్రేణుల అందరికీ ఎంతో సంతోషకరమైన విషయం భావించి కావున
తెలంగాణా ఉమ్మడి పది జిల్లాల్లో మరియు

గ్రేటర్ హైదరాబాద్ లోని జనసేన పార్టీలో వివిధ పదవులలో ఉన్న నాయకులు వీర మహిళలు మీరు అందరూ
మీ నియోజకవర్గంలో నుండి పార్టీ శ్రేణులు అందరు పాల్గొనేలా పూర్తి బాధ్యత తీసుకొని ఈ యొక్క మెసేజ్ ను అందరికీ తెలియపరచి అందరూ పాల్గొనేలా బాధ్యత వహించాలని రాష్ట్ర నాయకత్వం తరపున కోరుతున్నాము
జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు      హైదరాబాద్ తెలంగాణ

#నరేంద్ర

NO COMMENTS

Exit mobile version