Home South Zone Andhra Pradesh గుంటూరు జిల్లాలో విద్యార్థుల అవగాహన ప్రత్యేక డ్రైవ్ |

గుంటూరు జిల్లాలో విద్యార్థుల అవగాహన ప్రత్యేక డ్రైవ్ |

0

గుంటూరు జిల్లా పోలీస్…
సంకల్పం” కార్యక్రమంలో భాగంగా గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల నివారణపై విద్యార్థులు, ప్రజలకు విస్తృత అవగాహన – ర్యాష్ డ్రైవింగ్, హెల్మెట్ వినియోగంపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహణ,

గంజాయి మరియు ఇతర మాదక ద్రవ్యాల వినియోగం వల్ల యువత, సమాజం ఎదుర్కొంటున్న దుష్పరిణామాలను నివారించడమే లక్ష్యంగా, గుంటూరు రేంజ్ ఐజీ శ్రీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఐపీఎస్ గారి ఆదేశాలు మరియు గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ గారి మార్గదర్శకత్వంలో, “సంకల్పం” కార్యక్రమం భాగంగా గుంటూరు జిల్లావ్యాప్తంగా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి.

ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, అలాగే సాధారణ ప్రజలను లక్ష్యంగా చేసుకొని గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే ఆరోగ్య, సామాజిక, చట్టపరమైన నష్టాలపై అవగాహన కల్పించారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, ఎవరైనా గంజాయి లేదా డ్రగ్స్ విక్రయాలు/రవాణా చేస్తున్న సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు.

అదేవిధంగా, రోడ్డు ప్రమాదాల నియంత్రణలో భాగంగా ర్యాష్ డ్రైవింగ్, హెల్మెట్ వినియోగం అంశాలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించబడింది. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, అధిక వేగం, నిర్లక్ష్య డ్రైవింగ్ ప్రాణాలకు ముప్పుగా మారుతుందని ప్రజలకు అవగాహన కల్పించారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

గుంటూరు జిల్లాను మాదక ద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దడంతో పాటు, రోడ్డు భద్రతను మరింత మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ తరహా అవగాహన కార్యక్రమాలు మరియు ప్రత్యేక డ్రైవ్‌లు నిరంతరం కొనసాగుతాయని జిల్లా పోలీసు అధికారులు తెలిపారు.

ఈ రోజు దుగ్గిరాల, పెదకాకాని, పొన్నూరు రూరల్, పొన్నూరు టౌన్, తెనాలి రూరల్, తెనాలి త్రీటౌన్, కాకుమాను, ప్రత్తిపాడు, చేబ్రోలు మొదలగు పోలీస్ స్టేషన్లలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా పోలీస్ అధికారులు మరియు సిబ్బంది”సంకల్పం” కార్యక్రమం నిర్వహించారు.

NO COMMENTS

Exit mobile version