మహబూబాబాద్
. డిసెంబర్.27 (భారత్ అవాజ్): కొత్తగూడ మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో PDSU ఆధ్వర్యంలో వాల్ పోస్టర్స్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పిడిఎస్యు మండల అధ్యక్షుడు బానోతు విష్ణు మాట్లాడుతూ…వరంగల్ పట్టణ కేంద్రంలో జనవరి 5, 6, 7 తేదీలలో జరిగే రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గత 50 సంవత్సరాలుగా విద్యార్థి లోకంలో తలలో నాలుకల విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమిస్తున్న సంఘం పిడిఎస్యు అని కొనియాడారు
. పిడిఎస్యు విద్యార్థి సంఘం తెలుగు రాష్ట్రాలలో ఎంతోమంది నాయకులను అందించిందని మరింత మందిని ఉన్నత స్థాయిలో తీర్చిదిద్దని తెలిపారు. ఉద్యమాల పుట్టిల్లు విప్లవాలకు ఓరుగల్లు గా పేరుగాంచిన వరంగల్ జిల్లా కేంద్రంలో నిర్వహించబోయే రాష్ట్ర మహాసభలు రాబోయే విద్యార్థి వ్యతిరేక విధానాలను మరింత ప్రజల్లోకి విద్యార్థి లోకంలోకి ప్రచారం చేయడానికి వేదిక కానున్నాయి.
శాస్త్ర విద్యా సాధన కోసం సమసమాజ స్థాపన కోసం ఎంతోమంది నేలకొరిగిన ఆ భావజాలం కోసం ఆ లక్ష్యం కోసం ఇంకా ప్రగశీల విద్యార్థులు పోరాడుతూనే ఉన్నారని ఇటువంటి ఎంతో చరిత్ర కలిగిన విద్యార్థి సంఘం మహాసభలకు మేధావులు విద్యార్థులు విద్యాభిమానులు అందరూ ఈ మహాసభల విజయవంతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
అదేవిధంగా మహబూబాబాద్ జిల్లా 4వ మహాసభలు జిల్లా కేంద్రంలోని టీపిటిఎఫ్ భవన్లో 29వతేదీన నిర్వహిస్తున్నామని జిల్లా మాసభను విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అజయ్, వినయ్, వెంకట్, సాయి, నిఖిల్, తదితరులు పాల్గొన్నారు.
