మహబూబాబాద్. డిసెంబర్.27
(భారత్ అవాజ్): జిల్లా షెడ్యూల్ కులముల అభివృద్ధి అధికారి కె. శ్రీనివాసరావు జిల్లాలోని 5వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతున్న షెడ్యూల్ కులముల బాలబాలికలకు ZPSS (బాలుర) పాఠశాల గూడూరు నందు ప్రీ మెట్రిక్ స్కాలర్ షిప్ లపై అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా అధికారి మాట్లాడుతూ 5 వ తరగతి నుండి 8వ తరగతి చదువుతున్న షెడ్యూల్ కులముల బాలురకు సం. 1000/- షెడ్యూల్ కులముల బాలికలకు రూ.1500/- మరియు 9,10 తరగతులు చదువుతున్న షెడ్యూల్ కులముల బాల బాలికలకు సాలిన 3500 /- (డేస్ స్కాలర్) రెసిడెన్షియల్ విద్యార్థిని విద్యార్థులకు రూ. 7000 / – ప్రభుత్వం స్కాలర్ షిప్ అందించనున్నట్లు మరియు 1వ తరగతి నుండి 8వ తరగతి వరకు చదువుతున్న
బాలబాలికలు కేవలం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న వారు మాత్రమే అర్హులని అదేవిధంగా 9 వ తరగతి మరియు 10 వ తరగతి చదువుతున్న విద్యార్ధులు ప్రైవేట్ మరియు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నవారు అర్హులని తెలిపినారు. పూర్తి వివరాల కోసం, జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి శాఖ కార్యాలయంలో సంప్రదించ వలసిందిగా తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు,
ఉపాధ్యాయులు మరియు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గూడూరు గారు పాల్గొన్నారు.
