గుంటూరు జిల్లా పోలీస్…
పోలీస్ గ్రీవెన్స్ డే”లో పోలీస్ సిబ్బంది వినతులు స్వీకరించిన జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపిఎస్ గారు.
“ప్రతి శుక్రవారం” గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లాలోని ఆయా పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న పోలీస్ సిబ్బంది వినతులు మరియు సమస్యల పరిష్కారానికి నిర్వహించే “పోలీస్ స్టాఫ్ గ్రీవెన్స్” కార్యక్రమం ఈ రోజు కూడా నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ గారు గ్రీవెన్స్ కి పోలీస్ సిబ్బంది నుండి నేరుగా వినతులను స్వీకరించి, వారి సమస్యలను ఆలకించి, ప్రాధాన్యతా క్రమంలో వాటిని పరిష్కరిస్తానని తెలపడం జరిగింది.
పోలీస్ సిబ్బంది తమ వృత్తి పట్ల నిబద్ధత, నిజాయితీ మరియు బాధ్యత కలిగి, ప్రజలకు ఉత్తమమైన పోలీస్ సేవలు అందిస్తూ, పోలీస్ శాఖ పట్ల నమ్మకాన్ని పెంపొందించాలని సూచించారు.
పోలీస్ సిబ్బందికి అనువైన వాతావరణాన్ని కల్పించి, వారు స్వేచ్ఛగా, మనస్పూర్తిగా తమ విధులను నిర్వర్తించే విధంగా తగిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ గారు వెల్లడించారు.
