హిందూపురం: హిందూపురం పర్యటనలో భాగంగా గౌరవనీయులైన కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రివర్యులు శ్రీ వి. సోమన్నగారు ఈరోజు పలు ఆధ్యాత్మిక మరియు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ముందుగా, హిందూ సనాతన ధర్మ పరిరక్షకులు శ్రీ చారి కీర్తి గారి నివాసానికి మంత్రి విచ్చేయగా, వారికి ఘన స్వాగతం లభించింది. వారి ఆతిథ్యాన్ని స్వీకరించిన అనంతరం, మంత్రి గారు స్థానిక ప్రముఖులు మరియు గోసంరక్షకులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
ప్రముఖులతో భేటీ మరియు చర్చలు: ఈ సందర్భంగా హిందూ పెద్దలు శ్రీ సువూరు రామాంజనేయులు అన్న గారు, హిందూపురం డివిజన్ రైల్వే సలహాదారు శ్రీ మిశ్రీమాల్ అన్న గారు, మరియు ప్రముఖ వ్యాపారవేత్త శ్రీ అనిల్ (గోల్డ్ జ్యువెలరీ) గారు మంత్రిని కలిసి పలు అంశాలపై చర్చించారు. ముఖ్యంగా హిందూపురం ప్రాంత రైల్వే అభివృద్ధి, ప్రయాణికుల సౌకర్యాలు మరియు స్థానిక సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
గోసంరక్షకులతో ముఖాముఖి: మోతుకుపల్లి వాసులైన గోసంరక్షకులు ప్రకాష్, దివాకర్, శ్రీధర్, శివ, మంజునాథ్, నాగరాజుమరియు ఇతరులతో మంత్రి గారు మాట్లాడారు. గోసంరక్షణ మరియు ధర్మ పరిరక్షణ కోసం వారు చేస్తున్న కృషిని అడిగి తెలుసుకున్న మంత్రి, ఈ ప్రాంత సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, రైల్వే అధికారులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
