PGRS ద్వారా సర్టిఫికేట్ సమస్యకు పరిష్కారంబాపట్ల: బాపట్ల జిల్లా రేపల్లె మండలం అరవపల్లి గ్రామానికి చెందిన శ్రీ వై. సురేంద్ర గారు (తండ్రి సాయి బాబు) కు సంబంధించిన సర్టిఫికేట్ సమస్యకు ప్రజా గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ (PGRS) ద్వారా పరిష్కారం లభించింది.
ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం కింద లోన్ పొందేందుకు అవసరమైన పాపులేషన్ సర్టిఫికేట్ పొందే ప్రక్రియలో సమస్యలు తలెత్తడంతో ఆయన PGRSలో అర్జీ సమర్పించారు.ఈ అర్జీపై స్పందించిన రేపల్లె తహసీల్దార్ అర్జీదారునితో మాట్లాడి సమస్యను వివరంగా తెలుసుకుని, సంబంధిత వివరాలతో నివేదిక సిద్ధం చేశారు. అనంతరం అర్హతను పరిశీలించి పాపులేషన్ సర్టిఫికేట్‌ను జారీ చేశారు.
దీంతో శ్రీ వై. సురేంద్ర గారికి ఎదురైన సర్టిఫికేట్ సమస్యకు పూర్తిస్థాయిలో పరిష్కారం లభించింది. ప్రజల సమస్యలను వేగంగా, పారదర్శకంగా పరిష్కరించడంలో PGRS వ్యవస్థ ఎంతో ప్రభావవంతంగా ఉందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
#నరేంద్ర
