Home South Zone Andhra Pradesh PGRS వినియోగంపై ప్రజలకు పిలుపు|

PGRS వినియోగంపై ప్రజలకు పిలుపు|

0

*’పి.జి.ఆర్.ఎస్’ వ్యవస్థను ప్రజలందరూ సద్వినియోగించుకోవాలి:గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము*

*టిడిపి కార్యాలయం(ప్రజావేదిక)లో…ప్రజల నుండి సమస్యల అర్జీలను స్వీకరించిన ఎమ్మెల్యే*

*సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి…. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకున్న ఎమ్మెల్యే రాము*

గుడివాడ డిసెంబర్ 28:ప్రజా సమస్యలు సత్వరం పరిష్కారం అయ్యేలా కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సూచించారు.

గుడివాడ పట్టణం ఏలూరు రోడ్డులోని టిడిపి కార్యాలయం (ప్రజా వేదిక)లో…. గుడివాడ పరిసర ప్రాంతాలకు చెందిన పలువురు సమస్యలను ఎమ్మెల్యే రాము దృష్టికి తీసుకొచ్చారు.

న్యూ ఇందిరా నగర్ కాలనీలో డ్రైనేజీ సమస్య, పిన్నమనేని నగర్ లో వాటర్ పైప్ లైన్ సమస్యపై… స్థానికులు ఇచ్చిన అర్జీల మేరకు మున్సిపల్ అధికారులతో మాట్లాడిన ఎమ్మెల్యే రాము… సమస్య పరిష్కార చర్యలు సూచించారు. పలువురు తమ సమస్యలను ఎమ్మెల్యే రాము దృష్టికి తీసుకొచ్చి….అర్జీలను అందజేశారు. ప్రతి అర్జీను పి.జి.ఆర్.ఎస్ లో నమోదు చేసి సత్వర పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటామని…. తనను కలిసిన వారికి ఎమ్మెల్యే రాము భరోసా ఇచ్చారు.

ప్రజా వేదిక కార్యాలయంలో, ప్రజలు అందించే సమస్యలు పరిష్కారం అయ్యేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసామని ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు.
గుడివాడ అభివృద్ధి, ప్రజా సమస్యలను పరిష్కరించడం లక్ష్యంగా ముందుకు సాగుతున్నానని సందర్భంగా ఎమ్మెల్యే రాము పునరుద్గాటించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ M.E ప్రసాద్, తాసిల్దార్ కుమార్, మున్సిపల్ D.E కరుణ్ బాబు,మండల టిడిపి అధ్యక్షుడు వాసే మురళి, మార్కెట్ యార్డ్ చైర్మన్ చాట్రగడ్డ రవికుమార్,టీడీపీ నాయకులు రెడ్డి అప్పారావు,సమ్మెట బ్రహ్మాజీ,మున్సిపల్ ae శ్రావణ్, ఆర్డబ్ల్యుసి A.E.కిస్మత్ రాణి,తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

Exit mobile version