*గుడివాడ ప్రజల భావోద్వేగ సమస్యలలో ఒకటైన… బైపాస్ రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తున్నాం:ఎమ్మెల్యే వెనిగండ్ల రాము*
*రోడ్డు సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే రాముకు ధన్యవాదాలు తెలుపుతున్న… గుడివాడ ప్రజలు, వాహనదారులు*
*రహదారి ఫైనల్ కోట్ బి.సి వర్క్ పనులను పరిశీలించిన…ఎమ్మెల్యే*
*రెండు రోజుల్లో రహదారి అభివృద్ధి పనులు పూర్తవుతాయని వెల్లడించిన అధికారులు…*
*బైపాస్ కు అనుసంధానంగా ఉన్న….సీ.సీ రోడ్లకు కనెక్టివిటీ పనులు చెయ్యండి….*
గుడివాడ డిసెంబర్ 28: గుడివాడలో భావోద్వేగ సమస్యలలో ఒకటైన బైపాస్ రోడ్డు అభివృద్ధి పనులు తుది దశకు చేరుకున్నాయని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. త్వరలో బస్టాండ్ అభివృద్ధి పనులు ప్రారంభమవుతాయని,మరో ప్రధాన సమస్య అయిన కంకిపాడు రహదారి అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
రూ.2.50 కోట్ల ఆర్ & బి నిధులతో ప్రారంభమైన గుడివాడ బైపాస్ రోడ్డు అభివృద్ధి పనులు తుది దశకు చేరుకున్నాయి.అభివృద్ధి పనులను ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆదివారం ఉదయం పరిశీలించారు.తుది దశలో జరుగుతున్న ఫైనల్ కోట్ బీసీ వర్క్ పనుల వివరాలను అధికారులు ఎమ్మెల్యే రాముకు తెలిపారు. బైపాస్ రహదారికి అనుసంధానంగా ఉన్న సీసీ రోడ్లకు కనెక్టివిటీ పనులు కూడా పూర్తి చేయాలని అధికారులకు ఎమ్మెల్యే రాము సూచించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ గుడివాడ ప్రధాన సమస్యల్లో ఒకటైన బైపాస్ రోడ్డు అభివృద్ధి పనులు 90శాతం పూర్తయినట్లు చెప్పారు.ఇప్పటికే అభివృద్ధి పనుల్లో ప్రధానమైన BMO వర్కులు పూర్తి చేశామని,ఫైనల్ కోట్ బి.సి వర్క్ పనులు జరుగుతున్నాయి అన్నారు.మరో రెండు రోజుల్లో తుది దశ పనులు కూడా పూర్తవుతాయన్నారు.
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ సహకారంతో…. భావోద్వేగంతో కూడుకున్న గుడివాడ సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామన్నారు.త్వరలో బస్టాండ్ అభివృద్ధి పనులు ప్రారంభం అవుతాయన్నారు. మరో ప్రధాన సమస్య అయిన కంకిపాడు రహదారి అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్&బి D.E జె. కామేశ్వరరావు,జనసేన ఇన్చార్జి బూరగడ్డ శ్రీకాంత్, మార్కెట్ యార్డ్ చైర్మన్ చాట్రగడ్డ రవికుమార్, యేసుపాదం,పమిడిముక్కల వంశీ, అట్లూరి స్వరూప్, షేక్ నాగూర్,ఆర్&బి అధికారులు,కూటమి నాయకులు.
