Home South Zone Andhra Pradesh కర్ణాటక పాదయాత్ర భక్తులపై దిడ్డివారిపల్లి గ్రామస్తుల భక్తి చూపులు |

కర్ణాటక పాదయాత్ర భక్తులపై దిడ్డివారిపల్లి గ్రామస్తుల భక్తి చూపులు |

0

కర్ణాటక రాష్ట్రం నుంచి తిరుమలకు పాదయాత్ర చేస్తున్న భక్తులకు శనివారం ఉదయం 3 గంటల నుంచి పుంగనూరు నియోజక వర్గం, సోమల మండలం, దిడ్డివారిపల్లె గ్రామస్తులు తమ వంతు సాయంగా పాలు, టీ, కాఫీ, బిస్కెట్లను అందజేస్తున్నారు.
ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ఉదయం నుంచి 6,000 మంది భక్తులు తిరుమలకు పాదయాత్ర చేశారని, 70 లీటర్ల పాలతో వారికి చలి నుంచి ఉపశమనం పొందే విధంగా టీ, కాఫీ అందిస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో రమణ, రామ్మోహన్, సుబ్రహ్మణ్యం, రత్నయ్య, రెడ్డి, లలిత, గిరిజ తదితరులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.

NO COMMENTS

Exit mobile version