కర్నూలు :
కర్నూలు సిటీ : ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు అన్-ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్‌మెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కర్నూలు నగరంలోని 45 ప్రైవేటు విద్యాసంస్థల్లో విద్యార్థులకు క్విజ్, డ్రాయింగ్, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేశారు.
సెయింట్ జోసెఫ్ డిగ్రీ కళాశాలలోని విద్యార్థులు బహుమతులు అందుకున్నారు. విద్యార్థుల్లో చదువుతోపాటు వ్యక్తిత్వ వికాసం పెంపొందించేందుకు ఈ పోటీలు నిర్వహించామని ప్రైవేటు స్కూల్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వాసుదేవయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు అన్ ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్‌మెంట్స్ అసోసియేషన్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
