కర్నూలు : కర్నూలు మెడికల్ కాలేజీలో పూర్వ విద్యార్థుల సాయంతో రూ.50 కోట్లతో నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి టీజీ భరత్ చెప్పారు. ఆయన శుక్రవారం కళాశాలలో అధికారులు, వైద్యులతో సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.
విదేశాల్లో నివసిస్తున్న కేఎం సీ పూర్వ విద్యార్థులు రూ.50 కోట్లతో నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు చేయడానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు. 66.66 సెంట్ల స్థలంలో నాలెడ్జ్ సెంటర్ నిర్మిస్తారన్నారు. ఇందులో ఆడ్వాన్స్డ్ లైబ్ర రీ, రీసెర్చ్ సెంటర్, జిమ్, పెవిలియన్, ఇండోర్ గేమ్స్ కాంప్లెక్స్, మీటింగ్ హాలు వంటి సదుపా యాలు ఉంటాయన్నారు. ఏడాదిలోపు నిర్మాణం పూర్తి చేసి కళాశాలకు అందజేస్తారన్నారు.అనంతరం సమస్యలను ప్రస్తావించాలని కోరగా.. ప్రాంతీయ ప్రభుత్వ కంటి ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ.
. డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేదని, భవనం పాతబడి పెచ్చులు ఊడిపడుతున్నాయని తెలపగా త్వరలో పనులు ప్రారంభిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఆప్టికల్ సోనోగ్రఫి పరికరం అవసరం ఉందని చెప్పగా వెంటనే ఏర్పాటు చేస్తామన్నారు.కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెం డెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ..
నిధుల కొరత వల్ల ఐపీఎం బిల్డింగ్ అసంపూర్తిగా ఆగిపో యిందన్నారు. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ద్వారా రూ.14.16 కోట్లతో 150 పడకలతో రోగుల సహామాట్లాడుతున్న మంత్రి టీజీ భరత్యకులకు రాత్రి బస నిమిత్తం నేషనల్ బిల్డింగ్ కన్ స్ట్రక్షన్ కార్పొరేషన్ వారి ద్వారా భవన నిర్మాణానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు.మెడికల్ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సాయిసుధీర్ మాట్లాడుతూ..
మెన్స్ హాస్టల్ కు 150 మందికి సరిపోయే గదులు అవసరమని, మార్చురీ వద్ద షెడ్ అవసరం ఉందని, ఫ్రీజర్ బాక్స్లు అవసరమని మంత్రికి వివరించారు.ఆర్థోపెడిక్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీనివాసులు మాట్లాడు తూ.. పేద రోగులకు ఇన్స్టాంట్స్ ప్రభుత్వం తరపున ఉచితంగా ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో అందిస్తే బా గుంటుందని కోరగా ఈ విషయంపై ముఖ్యమంత్రితో చర్చిస్తామని మంత్రి చెప్పారు.
అనంతరం ఏఏ విభాగానికి ఏమేమి కావాలో నివే దిక రూపంలో అందించా లని సూచించారు. సమా వేశంలో విదేశీ వైద్య విద్యా ర్థుల సమన్వయకర్త డాక్టర్ కేజీ గోవిందరెడ్డి, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు డాక్టర్ ప్రవీణ్, రఘునాథ్ రెడ్డి, జగదీష్, సాయిప్రదీప్, అడ్మినిస్ట్రేటర్ సింధు సుబ్రహ్మణ్యం, హెచ్డీలు, ప్రొఫెసర్లు పాల్గొన్నారు.
