Home South Zone Andhra Pradesh రౌడీ షీటర్ జిల్లా బహిష్కరణ !! కర్నూలు ఎస్పీ |

రౌడీ షీటర్ జిల్లా బహిష్కరణ !! కర్నూలు ఎస్పీ |

0

కర్నూలు : కర్నూలు జిల్లా…* వడ్డే తులసి కుమార్ పై జిల్లా బహిష్కరణ ఉత్తర్వుల జారి…* ఇప్పటివరకు ముగ్గురు జిల్లా బహిష్కరణ .కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ A. సిరి  ఐఏఎస్ గారు.కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపిఎస్ గారు .కర్నూలు నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని షరీన్ నగర్లో  నివాసముండే  (వడ్డే రామాంజనేయులు పెద్ద కుమారుడైన) వడ్డే తులసి కుమార్ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు అలవాటు పడిన  ఇతని పై కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ A. సిరి ఐఏఎస్ గారు జిల్లా బహిష్కరణ ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది.

కర్నూలు ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ లో  వడ్డే తులసి కుమార్ పై రౌడీషీట్ నెంబర్ 389 ఉంది. ఈయన 5 క్రిమినల్ కేసులలో నిందితుడుగా ఉన్నాడు. అందులో హత్యలు, దోపిడీలు,  ఎస్సీ ఎస్టీ వర్గాల మీద దాడులు,  జులుం కేసులు, హత్యాయత్నం కేసులు , ఇలా పలు రకాల కేసులు ఈయన పై నమోదయి ఉన్నాయి.

పై తెలిపిన కేసుల్లో పలు మార్లు రిమాండ్ కు వెళ్లి ఖైదు చేయబడినప్పటికీ కూడా ఆయన ప్రవర్తనలో ఎటువంటిమార్పు రాకపోగా,  తదుపరి రకరకాల కేసులలో పాల్గొంటున్నాడని  కర్నూల్ జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపిఎస్ గారి యొక్క ప్రతిపాదనల మేరకు ఇతని యొక్క క్రిమినల్ రికార్డు లను నిశితంగా పరిశీలించిన మీదట జిల్లా కలెక్టర్  డా. ఏ. సిరి ఐఏఎస్ గారు ఈ రోజున ఇతని మీద జిల్లా బహిష్కరణ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్  గారు మాట్లాడుతూ…

జిల్లాలో ఇప్పటివరకు చెడు నడత కలిగిన ముగ్గురిపై (వడ్డే రామాంజనేయులు పటాన్ ఇమ్రాన్ ఖాన్ వడ్డే తులసి కుమార్)జిల్లా బహిష్కరణ ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందన్నారు.జిల్లాలో ఇప్పటినుండి ఎవరైనా రౌడీయిజంతో  అరాచక శక్తులుగా  మారి , ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ,  శాంతిభద్రతలకు విఘాతం కలగజేసే విధంగా ప్రవర్తిస్తే అటువంటి వారిపై జిల్లా బహిష్కరణతో పాటు గా పీడి యాక్ట్ నమోదు చేసి జైలుకు తరలించడం జరుగుతుందని,  ప్రశాంతంగా, మంచిగా,

బుద్ధిగా జీవించాలని జిల్లా ఎస్పీ గారు కోరారు.ఇటువంటి చెడు నడత కలిగిన  చాలామంది పేర్లు  జిల్లా బహిష్కరణ  పరిశీలనలో ఉన్నాయని, మంచి ప్రవర్తనతో జీవించాలని కర్నూల్ జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు హెచ్చరించారు.

NO COMMENTS

Exit mobile version