మునిసిపల్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నగర కార్యదర్శి మాల్యాద్రి డిమాండ్ చేశారు.
గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట జరిగిన ధర్నాలో ఆయన మాట్లాడారు. ఆప్కాస్ వర్కర్ల పదవీ విరమణ వయసును 62 సంవత్సరాలు లకు పెంచాలని, పెండింగ్ బకాయిలు చెల్లించాలని, మృత కార్మికుల కుటుంబాలకు ఉద్యోగాలు కల్పించాలన్నారు కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలన్నారు.
