భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
విజయవాడ,
తేది : 29 డిసెంబర్, 2025.
బంద్‌పై తీవ్ర నిర్బంధం
సిపిఐ(యం) నేతలు, నక్కపల్లి ప్రజల అక్రమ అరెస్టులకు ఖండన
రైతు నాయకులు, సిపిఐ(యం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం.అప్పలరాజుపై పిడి యాక్ట్ పెట్టి అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఈరోజు అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం, నక్కపల్లి మండలాల్లో జరిగిన బందులో పాల్గొన్న సిపిఐ(యం) శ్రేణులను, సాధారణ ప్రజలపై తీవ్రమైన నిర్బంధాన్ని ప్రయోగించి అక్రమ అరెస్ట్‌లు చేయడాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు తీవ్రంగా ఖండిరచారు.
ఎస్ రాయవరం పోలీస్ స్టేషన్‌లో ఉన్న నాయకులను కలసుకొని సంఫీుభావం ప్రకటించారు.
అక్రమ భూసేకరణకు వ్యతిరేకంగా ప్రజల తరపున నిలబడి పోరాడుతున్న అప్పలరాజును చట్ట విరుద్ధంగా అరెస్టు చేయడమే కాకుండా దానికి నిరసనగా బంద్ పాటిస్తున్న ప్రజలను భయ భ్రాంతులకు గురి చేయడం, నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేయడం ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనం.
రైతుల భూములను అక్రమంగా కార్పొరేట్లకు కట్టబెట్టడానికి వారు చట్టాలను తుంగలో తొక్కి అధికారం దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. విశాఖ ఉక్కును తాకట్టు పెట్టి నక్కపల్లి ప్రాంతంలో రసెల్ మిత్తల్ ఉక్కు ఫ్యాక్టరీ కోసం ప్రభుత్వం తాపత్రయం పడుతున్నది. బల్క్ డ్రగ్ పార్కు కు వ్యతిరేకంగా పోరాడుతున్న రాజయ్యపేట గ్రామస్తులను మభ్యపెట్టి భూములు స్వాధీనం చేసుకోవాలని చేస్తున్నారు.
బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీని పెట్టబోమని నోటి మాటగా హామీ ఇచ్చినా ముఖ్య మంత్రి ఆ మేరకు నోటిఫికేషన్ ను ఉపసంహరించు కోక పోవడం వారి కపట నీతిని ఎత్తిచూపుతున్నది. వారి కుట్రలకు అడ్డుగా నిలుస్తున్నారని కక్షతోనే అప్పలరాజుపై పీడీ యాక్ట్‌ను ప్రయోగించారు.
అరెస్ట్ అయిన వారిలో సిపిఐ(యం) కేంద్ర కమిటీ సభ్యులు కె.లోకనాథం, జిల్లా కార్యదర్శి జి.కోటేశ్వరరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు డి.వెంకన్న, ఆర్.శంకర్రావు, గంటా శ్రీరామ్, గనిశెట్టి సత్యనారాయణ, వి.వి. శ్రీనివాసరావు, డి.సత్తిబాబు, ఎం.రాజేష్, ఆర్.రాము, జి.దేముడు నాయుడు, రామకృష్ణ, డి.డి.వరలక్ష్మి, డి.మాణిక్యం, కాశి తదితరులు ఉన్నారు.
తక్షణం వారిని విడుదల చేయాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది.
నిర్బంధాన్ని అధిగమించి బంద్‌ను జయప్రదం చేసిన కార్యకర్తలకు, వివిధ పార్టీలకు, ప్రజాసంఘాలకు సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ ధన్యవాదాలు తెలియచేస్తున్నది.
