బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ సోమవారం రాత్రి చీరాల టూ టౌన్ పోలీస్ స్టేషన్లో వార్షిక తనిఖీ నిర్వహించారు
బాపట్ల: బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ సోమవారం రాత్రి చీరాల టూ టౌన్ పోలీస్ స్టేషన్లో వార్షిక తనిఖీ నిర్వహించారు. ముందుగా గౌరవ వందనం స్వీకరించి తదుపరి పోలీస్ స్టేషన్లోని అన్ని విభాగాలను సందర్శించారు.
క్రైమ్ రికార్డులు పరిశీలించారు.తీవ్రమైన నేరాల్లో పోలీసుల దర్యాప్తు తీరును అడిగి తెలుసుకున్నారు.రోడ్డు ప్రమాదాల తగ్గింపునకు,నేరాల నిరోధానికి తీసుకోవాల్సిన చర్యలను సూచించారు. ప్రజలు కూడా తమకేమైనా సమస్యలు ఉంటే నేరుగా తన దృష్టికి తేవచ్చునని ఎస్పీ తెలిపారు.చీరాల డీఎస్పీ మోయిన్,టూ టౌన్ సిఐ నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో తగ్గిన క్రైమ్ రేట్,5285 కేసులు నమోదు, గత ఏడాదితో పోలిస్తే 15% తగ్గుదల,68% చోరి సొత్తు రికవరీ: ఎస్పీ ఉమామహేశ్వర్ వెల్లడి.
#నరేంద్ర
