Home South Zone Andhra Pradesh చెబ్రోలు మండలం ఘర్షణ.. వ్యక్తికి జైలు శిక్ష |

చెబ్రోలు మండలం ఘర్షణ.. వ్యక్తికి జైలు శిక్ష |

0

గుంటూరు జిల్లా పోలీస్…
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతికి కారణమైన కేసులో ఆటో డ్రైవర్ కు 22 నెలల జైలు శిక్ష,రూ.10,000/- జరిమానా,.

కేసు వివరాలు :* ది.07.10.2018న తెల్లవారుజామున నిందితుడు తన ఆటోను చేబ్రోలు నుండి ముట్లూరు వైపు అతివేగంగా, నిర్లక్ష్యంగా నడుపుతూ, ఎదురు దిశ నుండి టీవీఎస్ ఎక్స్‌ఎల్ మోపెడ్ (వాహనం నం. AP07UTTR8412) పై ప్రయాణిస్తున్న కొచర్ల.హృదయరాజు (48 సంవత్సరాలు)ను ఢీకొట్టాడు.

ఈ ప్రమాదంలో హృదయరాజు తీవ్ర గాయాలపాలై అపస్మారక స్థితికి చేరుకున్నారు. చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌కు తరలించగా, చికిత్స పొందుతూ 12.10.2018 సాయంత్రం 7.03 గంటలకు మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించి అప్పటి డి.అశోక్ గారు Cr.No: 140/2018, Sec 304-A IPC, 180, 181 of Motor vehicles act. కింద కేసు నమోదు చేసి, సమగ్ర దర్యాప్తు జరిపి, కోర్టు వారికి సాక్ష్యాధారాలను సమర్పించారు.తదుపరి ఈ కేసులో ప్రస్తుత సీఐ రామా నాయక్ గారు మరింత సమగ్ర దర్యాప్తు జరిపి, కారులో ఛార్జ్ షీట్ దాఖలు చేసినారు.

సాక్ష్యాధారాలను పరిశీలించిన గౌరవ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి, గుంటూరు గారు నిందితుడిని Cr.P.C సెక్షన్ 255(2) ప్రకారం దోషిగా నిర్ధారించి,1 సంవత్సరం 10 నెలల సాధారణ కారాగార శిక్ష మరియు రూ.10,000/- జరిమానా (జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా 1 నెల సాధారణ కారాగార శిక్ష).

నిందితుడు వివరాలు :* పలపర్తి.సత్యనారాయణ, తండ్రి వెంకటేశ్వర్లు (45 సంవత్సరాలు) ముట్లూరు గ్రామం, (ఆటో డ్రైవర్ – వాహనం నం. AP 07 TK 1662). * దర్యాప్తు అధికారులు : CI రామానాయక్ గారు, SI శ్రీ డి. అశోక్ గారు. * ప్రాసిక్యూషన్ తరఫున వాదనలు వినిపించిన వారు

శ్రీ పి. మురళీ కృష్ణ, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ * న్యాయస్థానం : గౌరవ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు, గుంటూరు * గౌరవ న్యాయమూర్తి : శ్రీమతి వి. దీప్తి. * CMS సీఐ నరసింహారావు గారు * కోర్ట్ పి.సి : PC-4343 ఈ. ప్రకాష్‌బాబు, వట్టిచెరుకూరు పోలీస్ స్టేషన్

రోడ్డు భద్రత నిబంధనలను పాటించకపోతే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని జిల్లా పోలీసులు హెచ్చరిస్తున్నారు.

NO COMMENTS

Exit mobile version