Home South Zone Andhra Pradesh విద్యార్థులలో మాదకద్రవ్య అవగాహన.. గుంటూరు పోలీస్ కార్యకమం |

విద్యార్థులలో మాదకద్రవ్య అవగాహన.. గుంటూరు పోలీస్ కార్యకమం |

0

గుంటూరు జిల్లా పోలీస్..

“సంకల్పం” కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో మాదక ద్రవ్యాలపై అవగాహన కల్పిస్తున్న గుంటూరు జిల్లా పోలీస్ అధికారులు,.

గుంటూరు రేంజ్ ఐజీ శ్రీ సర్వ శ్రేష్ట త్రిపాఠీ ఐపీఎస్ గారు మరియు గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, సంకల్పం కార్యక్రమం ద్వారా గుంటూరు జిల్లా పోలీస్ అధికారులు తమ తమ పోలీస్ స్టేషన్ పరిధిలోని స్కూళ్లు, కాలేజీలలో గంజాయి మరియు ఇతర మాదక ద్రవ్యాల వల్ల కలిగే దుష్ప్రభావాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు.

ఈ కార్యక్రమాలలో భాగంగా విద్యార్థులకు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే శారీరక, మానసిక నష్టాలను వివరించారు. మాదక ద్రవ్యాలకు అలవాటు పడితే భవిష్యత్ నాశనం అవుతుందని, చదువుపై ఏకాగ్రత కోల్పోయి పరీక్షల్లో విఫలమవుతారని, ఉన్నత చదువుల్లో రాణించలేరని స్పష్టం చేశారు.

అంతేకాకుండా, తల్లిదండ్రులు తమ పిల్లలపై పెట్టుకున్న నమ్మకాన్ని కోల్పోకుండా, వారికి మనోవేదన కలిగించకుండా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని విద్యార్థులకు సూచించారు.

సరదా కోసం లేదా ఆకతాయి తనంతో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల జోలికి వెళ్లవద్దని, మొదట అలవాటుగా మొదలై తరువాత వ్యసనంగా మారి జీవితాన్ని నాశనం చేస్తాయని హెచ్చరించారు.

ఈ అవగాహన కార్యక్రమాలలో * ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ గారు, ఇతర పోలీస్ అధికారులు KL యూనివర్సిటీ నందు * సౌత్ డిఎస్పీ శ్రీమతి భానోదయ గారు, వట్టి చెరుకూరు సీఐ రామా నాయక్ గార్లు మలినేని కాలేజీ

పుల్లడిగుంట మరియు ప్రియదర్శిని కాలేజీ, 5వ మైలు నందు * వెస్ట్ డిఎస్పీ అరవింద్ గారు, ఎస్సై రాంబాబు గార్లు నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని వడ్డెర కాలని నందు విద్యార్థులకు గంజాయి మరియు ఇతర మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు.

గుంటూరు జిల్లా పోలీస్ శాఖ యువత భవిష్యత్తును పరిరక్షించడమే లక్ష్యంగా, మాదక ద్రవ్యాల నిర్మూలనకు నిరంతరం చర్యలు చేపడుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు.

NO COMMENTS

Exit mobile version