ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చరిత్రపై పరిశోధనలు ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్ 48వ వార్షికోత్సవ సమావేశాలు వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నాలజీ యూనివర్సిటీలో జనవరి 3,4 తేదీలలో నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మువ్వ శ్రీనివాసరావు తెలిపారు.
ఈ సమావేశాలకు సంబంధించిన ప్రచార పత్రాలను వివిఐటి విశ్వవిద్యాలయం ఛాన్స్ ర్ వాసిరెడ్డి విద్యాసాగర్, ప్రొచానల్ వాసిరెడ్డి మహదేవ్, వైస్ ఛాన్స్లర్ ఛాన్స్ ర్ ప్రొఫెసర్ కొడాలి రాంబాబు విడుదల చేశారు.
ఈ సందర్భంగా మొవ్వ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ వైజ్ఞానిక పద్ధతులలో చరిత్ర అధ్యాయాన్ని ప్రోత్సహించడం, ఆంధ్రప్రదేశ్లో చరిత్ర పరిశోధనల ప్రగతిని మూల్యాంకన చేయడం మూల్యాంకన చేయడం ఈ సమావేశాలు ముఖ్య ఉద్దేశం అన్నారు.
అవనిగడ్డ శాసనసభ్యులు మండల బుద్ధ ప్రసాద్ జరగనున్న ఈ సమావేశాలను ప్రారంభించినట్లు తెలిపారు. ఈ సమావేశాలకు దేశవ్యాప్తంగా 200 మంది ప్రతినిధులు హాజరవుతారని, ఆధునిక చరిత్ర, సాంకేతికత, సామాజిక అంశాలపై పరిశోధనల పత్రాల సమర్పణ, చర్యలు జరుగుతాయని వివరించారు.
పాలక సభ్యురాలు వాసిరెడ్డి ప్రత్యూష, రిజిస్టర్ డాక్టర్ వై మల్లికార్జున్ రెడ్డి, ఏఎన్ యు హిస్టరీ ప్రొఫెసర్ ఎన్ మురళీమోహన్, డీన్ ఆఫ్ అకాడమిక్ డాక్టర్ కేక్ గిరిబాబు, వి వి ఐ టి యు పబ్లికేషన్ డివిజన్ సంధానకర్త మోదుగుల రవి కృష్ణ పాల్గొన్నారు.
