అరండలపేట పిఎస్ లిమిట్స్, గుంటూరు *గౌరవ ఏపీ ఈగల్ చీఫ్, ఐజిపి శ్రీ అకే.రవికృష్ణ, ఐపిఎస్ గారి ప్రసంగంతో ప్రేరణ – మత్తు చెర నుంచి మైనర్ బాలుడికి కొత్త జీవితం* గుంటూరు జేకేసి కాలేజ్‌లో రోటరీ క్లబ్ గుంటూరు వారితో కలిసి ఈగల్, ఆంధ్ర ప్రదేశ్, గుంటూరు వారు నిర్వహించిన అవగాహన కార్యక్రమం లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఈగల్ చీఫ్, గౌరవ ఐజిపి శ్రీ అకే రవికృష్ణ, ఐపిఎస్, గారు పాల్గొని, గంజాయి మరియు మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే శారీరక, మానసిక, సామాజిక దుష్ప్రభావాలపై విద్యార్థులకు విస్తృతంగా అవగాహన కల్పించారు.
యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాల్సిన అవసరం, కుటుంబం మరియు సమాజంపై దాని ప్రభావం గురించి వివరించడంతో పాటు, ప్రజలు ఎటువంటి భయభ్రాంతులకు లోనుకాకుండా సహాయం పొందేందుకు ఏర్పాటు చేసిన ఏపీ ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్ – 1972 ప్రాముఖ్యతను వివరించారు. ఈ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న అదే కాలేజ్‌కు చెందిన ఒక NCC విద్యార్థిని, ఐజిపి గారి ప్రసంగంతో ప్రేరణ పొందింది. సొల్యూషన్ మత్తుకు బానిసైన తన మైనర్ తమ్ముడిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో, ఈగల్ వ్యవస్థ గురించి తన తల్లి గారికి వివరించగా.
దాంతో ఆశ కలిగిన ఆ తల్లి వెంటనే 1972 టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేసి తమ కుటుంబ సమస్యను తెలియజేశారు. ఫిర్యాదు అందిన వెంటనే స్పందించిన 1972 సిబ్బంది గుంటూరు ఈగల్ సెల్ అధికారులు కు సమాచారం అందివ్వగా… గుంటూరు ఈగల్ సెల్ సిబ్బంది అత్యంత వేగంగా స్పందించి, ఆరండలపేట ప్రాంతంలోని సదరు మైనర్ బాలుడి నివాసానికి చేరుకున్నారు. అక్కడ బాలుడికి ఎటువంటి ఒత్తిడి లేకుండా, స్నేహపూర్వక వాతావరణంలో కౌన్సెలింగ్ నిర్వహించి మత్తు పదార్థాల వినియోగం వల్ల ఆరోగ్యంపై పడే ప్రభావాలు, మానసిక సమస్యలు, చదువు మరియు భవిష్యత్తుపై కలిగే నష్టాలను బాలుడికి స్పష్టంగా వివరించి, మత్తు నుంచి బయటపడేందుకు అవసరమైన మార్గదర్శకత్వం అందించారు. అనంతరం ఎన్‌జీవో అయిన నవజీవన్ బాల భవన్ గుంటూరు కోఆర్డినేటర్ శ్రీమతి కవిత గారి సహకారంతో బాలుడిని మంగళగిరి ఎన్‌ఆర్‌ఐ హాస్పిటల్‌కు తరలించి సైకియాట్రీ విభాగం వైద్యుల సూచనల మేరకు హాస్పిటల్ లో అడ్మిట్ చేపించి తగు వైద్యం ఇస్తున్నారు. తదుపరి బాలుడి భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని బాలుడిని నవజీవన్ బాల భవన్ రిహాబిలిటేషన్ సెంటర్‌కు తరలించే విధంగా చర్యలు చేపట్టి అవసరమైన చికిత్సతో పాటు పునరావాస కార్యక్రమాలు అందిచనున్నారు.
బాలుడి ఆరోగ్య పరిస్థితిని గుంటూరు ఈగల్ సెల్ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ, కుటుంబానికి అవసరమైన సహాయాన్ని అందించనున్నారు. ఈ ఘటన ద్వారా ఏపీ ఈగల్ నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో సానుకూల మార్పులు తీసుకువస్తున్నాయని స్పష్టంగా తెలుస్తోంది.
డ్రగ్స్ మరియు మత్తు పదార్థాల సమస్యతో బాధపడుతున్న కుటుంబాలు భయపడకుండా ముందుకు వచ్చి, ఏపీ ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్ 1972 కు సంప్రదించి సహాయం పొందాలని గౌరవ ఏపీ ఈగల్ చీఫ్ ఐజిపి శ్రీ అకే.రవికృష్ణ, ఐపిఎస్ గారు మరొక్కసారి పత్రికా ముఖంగా విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా సకాలంలో సరైన విధంగా స్పందించినందుకు గాను 1972 కాల్ సెంటర్ సిబ్బందిని మరియు గుంటూరు ఈగల్ సెల్ అధికారులని ఐజిపి శ్రీ ఆకే రవికృష్ణ, IPS గారు అభినందించారు ఈగల్, ఆంధ్ర ప్రదేశ్ #
