కర్నూలు :
కర్నూలు జిల్లా..జిల్లా ప్రజలకు, మీడియాకు, పోలీసులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన … జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ గారు.- యువత నూతన సంవత్సర వేడుకలలో అత్యుత్సాహంతో రోడ్డు ప్రమాదాలకు గురికావద్దు .- అందరూ బాధ్యతాయుతంగా వేడుకలు జరుపుకోవాలని సూచన.
2026 నూతన సంవత్సరo సందర్భంగా గురువారం రాత్రి కర్నూల్ జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపిఎస్ గారు కర్నూలు జిల్లా పోలీస్ కార్యాలయం _ కొండారెడ్డి బురుజు వద్ద కేక్ కట్ చేసి పోలీసు అధికారులకు, జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ క్షేమంగా, సురక్షితంగా, సుఖసంతోషాలతో ఉండాలని జిల్లా ఎస్పీ గారు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గారితో పాటు అడిషనల్ ఎస్పీలు హుస్సేన్ పీరా, కృష్ణమోహ న్, కర్నూల్ డిఎస్పి బాబు ప్రసాద్, కర్నూల్ పట్టణ సిఐలు ఉన్నారు.
