Home South Zone Andhra Pradesh మహారాష్ట్ర కొత్త డీజీపీగా 26/11 హీరో సదానంద్ దాతే |

మహారాష్ట్ర కొత్త డీజీపీగా 26/11 హీరో సదానంద్ దాతే |

0

మహారాష్ట్ర కొత్త డీజీపీగా 26/11 హీరో సదానంద్ దాతే
మహారాష్ట్ర: మహారాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్(డీజీపీ)గా 26/11 ఉగ్రదాడుల సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి సేవలందించిన సదానంద్ దాతే నియమితులయ్యారు. 1990 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన 59 ఏళ్ల సదానంద్ జనవరి 3న బాధ్యతలు స్వీకరించనున్నారు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు అధిపతిగా ఉన్న ఆయన ఇటీవలే కేంద్ర సర్వీసుల నుంచి రిలీవ్ అయ్యారు. రాష్ట్ర, కేంద్ర ఏజెన్సీల్లో ఆయనకు విస్తృతమైన అనుభవం ఉంది.

ఆర్థిక నేరాలపై పరిశోధనలకు గాను ఆయన పుణే విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పొందారు. మహారాష్ట్రలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న కీలక సమయంలో బాధ్యతలు స్వీకరిస్తున్నారు. దాతే 26/11 ముంబై ఉగ్రదాడులను ఎదుర్కొన్న హీరోలలో ఒకరిగా నిలిచారు. 2008 నవంబర్ 26న ఉగ్రదాడుల సమయంలో ఆయన ముంబై సెంట్రల్ రీజియన్ అదనపు పోలీసు కమిషనర్ గా పనిచేస్తున్నారు.

ఆయన నాయకత్వం లోని ఓ బృందం కామా ఆసుపత్రిపై దాడి చేసిన లష్కరే తోయిబా ఉగ్రవాదులు అజ్మల్ కసబ్, అబు ఇస్మాయిల్లను చుట్టుముట్టింది. గ్రెనేడ్ శకలాల వల్ల దాతే తీవ్రంగా గాయపడ్డారు. అయినప్పటికీ ఉగ్రవాదులతో పోరాడారు. ఆయన సేవలకుగాను కేంద్రం రాష్ట్రపతి పతకంతో సత్కరించింది. ఆ గ్రెనేడ్ శకలాలూ ఇప్పటికీ ఆయన శరీరంలో, కంటి దగ్గరా ఉన్నాయి. వాటిని గాయాలుగా కాక యుద్ధ క్షేత్రపు పతకాలుగా ఆయన అభివర్ణిస్తారు.

#Narendra

NO COMMENTS

Exit mobile version