రిమ్స్లో ఉట్నూర్ మండలం పిట్లగూడకు ఆదివాసీ మహిళ గంగశీల మృతి ఘటనలో ఏడుగురు సిబ్బందిపై జిల్లా యంత్రాంగం కఠిన చర్యలు తీసుకున్నట్లు తెలిసింది.
బాధ్యురాలైన వైద్యురాలిపై చర్యలకు డీఎంఈకి సిఫారసు చేయగా.. ముగ్గురు స్టాఫ్ నర్సుల డిప్యుటేషన్ రద్దు చేశారు. ఒక ఏఎన్ఎంను విధుల నుంచి తొలగించగా, ఇద్దరు ఆయాలను ఓపీకి మార్చారు. వైద్యుల నిర్లక్ష్యంపై బంధువుల ఆందోళనల నేపథ్యంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.