లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని, సాయి బొమ్మిడాల నగర్, శ్రీ సత్యసాయి స్పిరిచువల్ సిటీలో జనవరి 3,4,5వ తేదీల్లో “ఆంధ్ర సారస్వత పరిషత్తు” వారి ఆధ్వర్యంలో 3వ ప్రపంచ తెలుగు మహా సభలు – 2026 నిర్వహించనున్నారు.ఈ సభల నిర్వహణ అధ్యక్షులుగా ప్రముఖ గజల్ కళాకారుడు డా.గజల్ శ్రీనివాస్
వ్యవహరించనున్నారు.ఈ సభల్లో పాల్గొనడానికి మారిషన్ దేశాధ్యక్షులైన శ్రీ ధరమ్ బీర్ గోకుల్ గారు, ఒడిస్సా గవర్నర్ శ్రీ కంభంపాటి.హరిబాబు గారు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా. చంద్రబాబు నాయుడు గారు హాజరుకానున్నారు.
మారిషన్ దేశాధ్యక్షులైన శ్రీ ధరమ్ బీర్ గోకుల్ గారు 3వ తేదీ సాయంత్రం గుంటూరులోని ప్రముఖ ITC వెల్కమ్ హోటల్ కు రానున్నారు.అక్కడ నుండి ప్రపంచ తెలుగు మహా సభలకు హాజరై, తర్వాత మంగళగిరిలోని ప్రముఖ దేవాలయం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని దర్శించుకోనున్నారు.
రానున్న మూడు రోజుల్లో జిల్లాలో పర్యటించనున్న ప్రముఖుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ITC హోటల్ నందు, శ్రీ సత్య సాయి స్పిరిచువల్ సిటీ ప్రాంగణంలో, మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయం వద్ద జరుగుతున్న ఏర్పాట్లను జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ గారు, ఇంటెలిజెన్స్ ఎస్పీ శ్రీ ఆరిఫ్ హఫీజ్ ఐపీఎస్ గారు, జిల్లా అదనపు ఎస్పీలు శ్రీ ATV రవికుమార్ గారు(L&O), ఏ.హనుమంతు గారు(ఏఆర్), ఇతర పోలీస్ అధికారులు పరిశీలించారు.
ఆయా ప్రదేశాల్లో వీవీఐపీ గారి ప్రోటోకాల్ కు అనుగుణంగా చేపట్టవలసిన భద్రత మరియు బందోబస్తు ఏర్పాట్ల గురించి పోలీస్ ఉన్నతాధికారులు, రెవెన్యూ మరియు ఇతర శాఖల అధికారులు సమీక్ష నిర్వహించారు.
అదే విధంగా గుంటూరులోని ITC వెల్కమ్ హోటల్ నుండి శ్రీ సత్యసాయి స్పిరిచువల్ సిటీ వరకు మరియు మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం వరకు వెళ్ళేందుకు కల్పించవలసిన రూట్ బందోబస్తు గురించి పోలీస్ ఉన్నతాధికారులు చర్చించారు.
ఈ సందర్భంగా గుంటూరులోని ITC వెల్కమ్ హోటల్ నందు వీవీఐపీ గారికి పోలీస్ గౌరవ వందనం కల్పించడానికి, వారి భద్రతకు భంగం కలగకుండా తగిన ఏర్పాట్లు చేయడానికి గుంటూరు జిల్లా ఎస్పీ గారు, ఇంటెలిజెన్స్ ఎస్పీ గారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి, చేస్తున్న ఏర్పాట్ల గురించి తెలుగు సారస్వత పరిషత్తు అధ్యక్షులు శ్రీ గజల్ శ్రీనివాస్ గారితో చర్చించారు.
తదనంతరం శ్రీ సత్యసాయి స్పిరిచువల్ సిటీలో మహా సభల వేదికను గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీమతి తమీమ్ అన్సారీయా IAS గారితో కలసి ఎస్పీ గార్లు పరిశీలించి, అన్ని శాఖల అధికారులు సమన్వయం కలిగి వీవీఐపీల పర్యటనను విజయవంతం చేయాలని చర్చించుకున్నారు.
వీవీఐపీల రాక కోసం సిటీ ప్రాంగణంలో నిర్మిస్తున్న హెలిపాడ్ ను పోలీస్ మరియు రెవెన్యూ అధికారులతో కలసి పరిశీలించారు.
వీవీఐపీ గారి పర్యటన కొరకు మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం వద్ద చేపడుతున్న ఏర్పాట్లను పరిశీలించి, ప్రణాళికా బద్దంగా ఏర్పాట్లను పూర్తిచేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా తగిన ప్రణాళికతో ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టాలని సూచించారు. ఆలయం పరిసరాలలో సరైన బారి కేడింగ్ ఏర్పాటు చేసి ఎక్కడా ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని స్థానిక నార్త్ డిఎస్పీ మురళీ కృష్ణ గారికి సూచించారు.
ఈ కార్యక్రమాల్లో ఎస్పీ గార్లతో పాటు అదనపు ఎస్పీలు గారులు, ఈస్ట్ డిఎస్పీ అబ్దుల్ అజీజ్ గారు,నార్త్ డిఎస్పీ మురళీ కృష్ణ గారు, సౌత్ డిఎస్పీ శ్రీమతి భానోదయ గారు, ఎస్బి డీఎస్పీ శ్రీనివాసులు గారు, ఎస్బి సీఐ అలహరి. శ్రీనివాస్ గారులు, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
