Home South Zone Andhra Pradesh ఆకతాయిల ఆటకట్టిస్తాం.. డ్రోన్ కెమెరాల నిఘాలో విద్యాసంస్థలు

ఆకతాయిల ఆటకట్టిస్తాం.. డ్రోన్ కెమెరాల నిఘాలో విద్యాసంస్థలు

0

అన్నమయ్య జిల్లా పోలీసులు విద్యార్థినుల భద్రతను లక్ష్యంగా చేసుకుని డ్రోన్ కెమెరాల ద్వారా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు, పాఠశాలలు, కళాశాలల సమీపంలో ఆకతాయిల ఆగడాలు, ఈవ్‌టీజింగ్‌ను అరికట్టేందుకు శక్తి టీమ్స్ ఆధ్వర్యంలో ఉదయం, సాయంత్రం వేళల్లో డ్రోన్‌లతో పర్యవేక్షణ చేపడుతున్నారు.

అనుమానాస్పదంగా తిరిగినా, వేధింపులకు పాల్పడినా డ్రోన్ విజువల్స్ ఆధారంగా గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. వేధింపుల విషయంలో డయల్ 100 లేదా 112కు సమాచారం ఇవ్వాలని ఎస్పీ సూచించారు.

Exit mobile version