అన్నమయ్య జిల్లా, పుంగనూరు పోలీస్ స్టేషన్ ను కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పుంగనూరు,
చిత్తూరు ప్రాంతాల నుండి ప్రపంచవ్యాప్తంగా సారా కాసేందుకు నల్లబెల్లం సరఫరా జరుగుతోందని తెలిపారు. ఒరిస్సా, ఛత్తీస్గడ్ సరిహద్దుల్లో పట్టుబడే నల్లబెల్లం మొత్తం చిత్తూరు బెల్లమేనని, గతంలో బెల్లం పట్టుకుని కేసు పెడితే బెల్లం వ్యాపారస్తులు హైకోర్టు ఆర్డర్ తెచ్చుకున్నారని ఆయన పేర్కొన్నారు కొత్తూరు మురళి.
