Home South Zone Andhra Pradesh CM భద్రతా ఏర్పాట్లు గుంటూరు‌లో పరిశీలన |

CM భద్రతా ఏర్పాట్లు గుంటూరు‌లో పరిశీలన |

0

నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని రెడ్డి కళాశాల ఎదుట ఏర్పాటు చేసిన సరస్ – అఖిల భారత డ్వాక్రా బజార్ను ఈ నెల 8వ తేదీన గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సందర్శించనున్న సందర్భంగా, చేపట్టవలసిన భద్రతా మరియు బందోబస్తు ఏర్పాట్లను గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్, ఐపీఎస్ గారు పరిశీలించారు.

ఈ నెల 6వ తేదీ నుండి 18వ తేదీ వరకు నరసరావుపేట రోడ్డులోని రెడ్డి కళాశాల ఎదురు ప్రాంగణంలో సరస్ – అఖిల భారత డ్వాక్రా బజార్ ప్రదర్శన నిర్వహించబడుతుందని విదితమే.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీమతి తమీమ్ అన్సారీయా, ఐఏఎస్ గారితో కలిసి కార్యక్రమ ప్రాంగణాన్ని క్షేత్ర స్థాయిలో పర్యటించి, భద్రతా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.
కార్యక్రమ ప్రాంగణంలో వీవీఐపీ గారి కాన్వాయ్ ప్రవేశ మరియు నిష్క్రమణ మార్గాలు, వాహనాల పార్కింగ్ ఏర్పాట్లను పరిశీలించారు.

వీవీఐపీ గారు సందర్శించనున్న స్టాళ్లను పరిశీలించి, ఆయా ప్రాంతాల్లో చేపట్టవలసిన భద్రతా చర్యలు మరియు పోలీస్ బందోబస్తు ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు.

వీవీఐపీ గారు స్టాళ్ల నిర్వాహకులతో మాట్లాడేందుకు ఏర్పాటు చేస్తున్న సభా వేదికను పరిశీలించి, వీవీఐపీ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని పోలీస్ అధికారులకు సూచించారు.

ప్రదర్శన ప్రాంగణంలో పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని, క్షుణ్ణమైన తనిఖీలు నిర్వహించాలని, అలాగే పరిసర ప్రాంతాల్లో కూడా తగిన బందోబస్తును ఏర్పాటు చేసి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ గారు ఆదేశించారు.

ఈ పరిశీలనలో గౌరవ కలెక్టర్ గారు, గౌరవ ఎస్పీ గారితో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ అషుతోష్ శ్రీవాత్సవ IAS గారు, RDO శ్రీనివాసరావు గారు, జిల్లా అదనపు ఎస్పీ (ఏఆర్)శ్రీ హనుమంతు గారు, ఎస్బి డీఎస్పీ శ్రీనివాసులు గారు, ట్రాఫిక్ డిఎస్పీ బెల్లం శ్రీనివాస్ గారు, సౌత్ డిఎస్పీ శ్రీమతి భానోదయ గారు, నల్లపాడు సీఐ వంశీధర్ గారు, ఇతర పోలీస్ అధికారులు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

NO COMMENTS

Exit mobile version