మెదక్ జిల్లా హవేలీఘనాపూర్ మండలంలోని ఫరీద్పూర్ గ్రామంలో రైతుల పలు మామిడి తోటలను పరిశీలించారు. రైతులతో మాట్లాడుతూ పోతదశలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సలహాలు సూచనలు అందించారు.ఈ సందర్భంగా ఉద్యానవన శాఖ అధికారి ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ మామిడిలో పూత, కాయ ఎదుగుదలకు తక్కువ వర్షపాతం తక్కువ తేమ అవసరం. వర్షపాతం.
ఉష్ణోగ్రత, తేమ, గాలి, సూర్యరశ్మి మామిడి చెట్లను వివిధ దశలలో ప్రభావితం చేస్తాయి. పంట పెరుగుదల, ఉత్పాదకతలో ఇవి ప్రధానపాత్ర పోషించి పంట ఉత్పత్తిని నిర్ణయిస్తాయి. మామిడి పండించే అన్నిప్రాంతాలలో పూత, కాయ ఎదుగుదల, రుచి అనేవి ముఖ్యంగా వాతావరణంపై ఆధారపడి ఉంటాయి.మామిడి పూతసమయంలో వర్షపాతం చాలా కీలకం. మామిడి పండు పెరుగుదల,
అభివృద్దికి నెలవారి వార్షిక వర్షపాతం చాలా ముఖ్యమైనది. సాధారణంగా మామిడిలో పూత డిసెంబర్ రెండవ వారం నుండి జనవరి మొదటి వారంలోపు ప్రారంభమవుతుంది. ఉష్ణోగ్రత పెరుగుతున్న కొద్దీఆలస్యంగా పూతకు వచ్చిన కొమ్మల్లో మగపుష్పాలు అధికంగా ఏర్పడతాయి. 14°C కంటే తక్కువ ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడుపూత ఆలస్యంగా వస్తాయి. పూతకు రాని తోటల్లో, తేలికపాటి తడులు ఇచ్చినట్లయితే పూమొగ్గలు విచ్చుకొని పుష్పగుచ్చాలు ఏర్పడతాయి. పూమొగ్గలువిచ్చుకొని పుష్పగుచ్చాలు ఏర్పడతాయి.
పూమొగ్గలు పిందెగా మారుతున్న దశలో చెట్లకు నీరు ఇవ్వడం మొదలుపెట్టి, ఎరువులు వేసుకొని క్రమం తప్పకుండా నీరు ఇచ్చినట్లయితే త్వరగా పిందె కడుతుంది, కట్టిన పిందె రాలిపోకుండా కాపాడుకోవచ్చు. రాత్రి ఉష్ణోగ్రత 10°C కంటే తక్కువ ఉంటే, గాలిలో తేమ ఎక్కువ ఉన్నా కూడా పూతపై ప్రభావం చూపిస్తుంది, రాత్రి ఉష్ణోగ్రత 15°C కంటే ఎక్కువ ఉన్న పగటి ఉష్ణోగ్రత 25-30°C ఉన్న యెడల పుష్పాలు పగిలి పిందెలుగా మారతాయి.
ఉష్ణోగ్రత లో వ్యత్యాసం, గాలిలో తేమ ఎక్కువగా ఉండుట వలన, అసమాన వర్షపాతం మరియు వాతావరణం పూత రావడంపై ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా వాతావరణ పరిస్థితులలో పూత ఆధారపడి ఉంటుంది. రైతులు ఎటువంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదు, తగు జాగ్రత్తలు పాటిస్తూ మంచి దిగుబడులు సాధించవచ్చు.
1. పూత మెరుగుపరచడానికి చీడ పీడల నివారణ.
2. పొటాషియం నైట్రేట్ పిచికారి చేయడం,
3. పలుచగా నీటి తడులను ఇవ్వడం
4. 4. పిందె కట్టడాన్ని మెరుగుపరచడానికి 13-0-45 @10 గ్రా లేదా 0-52-34 (మోనో పొటాషియం ఫాస్ఫేట్) @10 గ్రా/
లీ + బోరాన్ @ 1.25 గ్రా/లీ. పిచికారీ చేయాలి.
5. పూత మరియు పిందె రాలడాన్ని నియంత్రించడానికి ప్లానోఫిక్స్ @ 4.5 మి.లీ/25 లీ. నీటికి కలిపి పిచికారీ చేయాలనీ వ్యవసాయ అధికారి ప్రతాప్ సింగ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉద్యానవన శాఖ అధికారి రచన, రైతులు తదితరులు ఉన్నారు.
