మదనపల్లె టమాటా మార్కెట్లో 10 కిలోల బాక్స్ రూ.220కి పడిపోయింది. మార్కెట్‌కు మంగళవారం 80మెట్రిక్ టన్నుల కాయలు వచ్చాయి.
10 కిలోల మేలు రకం టమాటాలు రూ.220, రెండో రకం రూ.210, మూడో రకం రూ.180తో వ్యాపారులు కొనుగోలు చేసినట్లు మార్కెట్ సెక్రటరీ జగదీశ్ వెల్లడించారు.
టమాటా దిగుబడి తక్కువగా వస్తున్నప్పటికీ రేట్లు పెరగకపోవడంతో రైతులు నిరాశ చెందుతున్నారు.
