మదనపల్లి రామారావు కాలనీలో సోమవారం పట్టపగలే రెండు వర్గాల యువకులు కర్రలు, రాళ్లతో నడిరోడ్డుపై భీకరంగా కొట్టుకున్నారు. ఈ దాడితో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘర్షణలో పలువురికి రక్తగాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న టూ టౌన్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘర్షణకు గల కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
