Home South Zone Andhra Pradesh అర్జీల పరిష్కారంలో జాప్యం వద్దు: కలెక్టర్ నిశాంత్ కుమార్.

అర్జీల పరిష్కారంలో జాప్యం వద్దు: కలెక్టర్ నిశాంత్ కుమార్.

0

మదనపల్లిలో సోమవారం నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ (PGRS)లో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ప్రజల నుండి 306 అర్జీలను స్వీకరించారు. వితంతు, వికలాంగుల పింఛన్లు, భూ వివాదాలపై వచ్చిన ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

క్షేత్రస్థాయి అధికారులు గ్రామాలను సందర్శించి సమస్యలను తెలుసుకోవాలని, అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా ఎప్పటికప్పుడు ఆడిట్ నిర్వహించాలని ఆయన స్పష్టం చేశారు.

NO COMMENTS

Exit mobile version