Home South Zone Andhra Pradesh కిడ్నీ డే టీ-షర్ట్‌లను ఆవిష్కరించిన సీపీ రాజశేఖర బాబు!

కిడ్నీ డే టీ-షర్ట్‌లను ఆవిష్కరించిన సీపీ రాజశేఖర బాబు!

0

ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర బాబు ప్రత్యేక టీ-షర్ట్‌లను ఆవిష్కరించారు. కిడ్నీ వ్యాధులపై ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.

మార్చి 12న నిర్వహించనున్న ర్యాలీ ద్వారా ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. కిడ్నీల రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను డాక్టర్ అమ్మన్న వివరించారు.

ఈ కార్యక్రమంలో పోలీస్ ఉన్నతాధికారులు మరియు వైద్య నిపుణులు పాల్గొని, ఆరోగ్యకరమైన జీవనశైలి ప్రాముఖ్యతను చాటిచెప్పారు. నగర ప్రజలు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పోలీస్ శాఖ తరపున సామాజిక బాధ్యతగా ఇలాంటి ఆరోగ్య అవగాహన కార్యక్రమాలకు పూర్తి మద్దతు ఉంటుందని సీపీ స్పష్టం చేశారు.

NO COMMENTS

Exit mobile version