Home South Zone Andhra Pradesh కళామందిర్ సిబ్బంది దాడి.. తల్లి, కొడుకుకు గాయాలు.

కళామందిర్ సిబ్బంది దాడి.. తల్లి, కొడుకుకు గాయాలు.

0

మదనపల్లె సిటిఎం మండలానికి చెందిన ముబారక్ భార్య నజీరా (40), ఆమె కొడుకు షఫీ (27)పై మదనపల్లె ఆర్‌ఆర్ స్ట్రీట్‌లో దాడి జరిగిన ఘటన కలకలం రేపింది. బాధితులు తెలిపిన వివరాల మేరకు, డ్రెస్సు కొనుగోలు చేసి మార్చుకునే విషయంలో న్యూ కళామందిర్ సిబ్బందితో మాటామాటా పెరగడంతో వారు దారుణంగా కొట్టినట్లు ఆరోపించారు.

దాడిలో గాయపడిన నజీరా ను బంధువులు మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై బాధితులు న్యాయం చేయాలని కోరారు.

NO COMMENTS

Exit mobile version