ప్రెస్ నోట్
మాల. యాదవులను చంపిన నీరుకొండలో టీడీపీ వ్యవస్థాపకులు. మాజీ సీఎం ఎన్టీఆర్ విగ్రహం ను ప్రజల సొమ్ము 1750 కోట్ల రూ.. తో నిర్మించే చంద్రబాబు నాయుడు ప్రభుత్వ చర్యలను పూర్తి గా వ్యతిరేకిస్తున్నామని. ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు తక్షణమే ఆపాలని దళిత బహుజన పార్టీ DBP జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్ ఆంధ్రప్రదేశ్ NDA రాష్ట్ర ప్రభుత్వం ను డిమాండ్ చేసారు. ఈ సందర్బంగా స్థానిక మీడియా వారికీ ఒక ప్రెస్ నోట్ విడుదల చేసారు. నీరుకొండ లో 1987 లో దళితుల వివాహం బ్యాండ్ కమ్మ కుల వీధి నుండి ఊరేగింపుగా వెళ్లిందని కుల వివక్షత. అణిచివేత తో… చంద్రబాబు నాయుడు నెత్రుత్యం లో..
. ఎన్టీఆర్ టీడీపీ ప్రభుత్వం హయాంలో కమ్మ సామాజిక వర్గం కు చెందిన హంతక ముఠా నలుగురు మాల. ఒకరు యాదవ కులానికి చెందిన వారిని కుల ఆధిపత్యం తో అతి దారుణం గా చంపేశారని.మారణాయుధాలు కత్తులు. వేటకొడవాళ్లు. బరిసెలు తో అతి కిరాతకంగా చంపేశారని.. ఆ దాడుల్లో పాల్గొన్న అగ్రకులాలకు సరైన శిక్షలు అప్పటి ఎన్టీఆర్ టీడీపీ ప్రభుత్వం వేయలేదన్నారు. బాధితుల కుటుంబాలకు న్యాయం జరగలేదన్నారు. మాల. యాదవ కుల ప్రజల ఆత్మగౌరవం పైన దాడిచేసే విధOగా లో కమ్మ కుల సామాజిక వర్గం ప్రతాపం చూపించడానికే నీరుకొండలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు కు చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్నారని ఆరోపించారు.
ఇది ఎన్టీఆర్ పైన ప్రేమ తో చేయటం లేదని.. చంద్రబాబు నాయుడు రాజకీయ స్వలాభం కోసం.. ప్రజల సొమ్మును దుబారా చేయడం మాత్రమే అన్నారు. ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయడలిస్తే… టీడీపీ కార్యాలయం. లేదా చంద్రబాబు. ఇంట్లోలోనో.. కమ్మ సామాజిక వర్గం నాయకులు ప్రాంతంలోనో వారి సొంత సొమ్ములతో ఏర్పాటు చేసికోవాలని.. అంతేగాని ప్రజలు ధనం తో.. ప్రభుత్వ స్థలం లో ఏర్పాటు చేయడం నిబంధనలకు విరుద్ధం అన్నారు. రాష్ట్రOలో 17 మెడికల్ కాలేజీల నిర్మాణ. నిర్వహణ లకు ప్రభుత్వం దగ్గర డబ్బు లేదంటూ.. సీఎం చంద్రబాబు నాయుడు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటిస్తూ…
1750 కోట్ల రూ.. ప్రజా ధనం తో ఎన్టీఆర్ విగ్రహం నిర్మాణానికి బడ్జెట్.. నిధులు ఏవిధంగా వచ్చాయని కృష్ణ స్వరూప్ NDA ప్రభుత్వం ను ప్రశ్నించారు.ఇలాంటి రాజకీయ నేతల విగ్రహాలు నిర్మాణం కు పూర్తి గా వ్యతిరేకిస్తున్నామని.. ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తే సహించమని.. అవసరం ఐతే హై కోర్ట్ లో పిటిషన్ లు వేసి
న్యాయ బద్దంగా అడ్డుకుంటామని. దళిత బహుజన సామాజిక వర్గం చేత ప్రజా ఆందోళన చెప్పడతామని కృష్ణ స్వరూప్ ప్రకటించారు. ఈ సమావేశం లో మాలమహానాడు జాతీయ సెంట్రల్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ : వీ. ఎల్. రాజు .
దళిత బహుజన పార్టీ (DBP) ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ జిలాని. రాష్ట్ర ఉపాధ్యక్షులు. సాకేటి. హేమంత్ కుమార్ మాదిగ. పార్టీ ఎన్టీఆర్ జిల్లా ఇంచార్జ్ ఎస్. ఆOజినేయులు
హై కోర్టు అడ్వకేట్ మద్దెల రాయప్ప తదితరులు పాల్గొన్నారు.
