Home South Zone Andhra Pradesh దావోస్ పర్యటనపై ముఖ్యమంత్రిని అడిగిన చంద్రశేఖర్నన్ |

దావోస్ పర్యటనపై ముఖ్యమంత్రిని అడిగిన చంద్రశేఖర్నన్ |

0

ముఖ్యమంత్రి చంద్రబాబుతో టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ మర్యాదపూర్వక భేటీ
• ఈ ఏడాది దావోస్ పర్యటనపై ముఖ్యమంత్రిని అడిగి తెలుసుకున్న చంద్రశేఖరన్

• ప్రపంచ పారిశ్రామిక రంగ పోకడలు, పారిశ్రామిక వేత్తల ఆలోచనలు తెలుసుకోవడానికి ఇదో మంచి వేదిక అన్న ముఖ్యమంత్రి

• ఏపీనీ బ్రాండ్ చేయడానికి, కొత్త పాలసీలపై మార్కెట్ లో అంచనా చేయడానికి ఈ పర్యటన ఎంతో దోహదం చేస్తుందని అభిప్రాయ పడిన ముఖ్యమంత్రి

• 2025 దావోస్ పర్యటనలో జరిపిన చర్చల్లో ఇప్పటికే రూ.2.50 లక్షల కోట్ల పెట్టుబడులు గ్రౌండ్ అయ్యాయని చెప్పిన సీఎం

• మూడు రోజులు వేర్వేరు సమావేశాల ద్వారా గ్రీన్ ఎనర్జీ, టెక్నాలజీ, ఎఐ,అగ్రికల్చర్, టూరిజం వంటి రంగాల్లో రాష్ట్ర సాధిస్తున్న విజయాలు వివరించామన్న సీఎం

• గతంతో పోలేస్తే భారత్ పట్ల ప్రపంచ దిగ్గజ సంస్థలు ఎక్కువ ఆసక్తి చూపుతున్నాయన్న ముఖ్యమంత్రి

• యువశక్తి, సమర్థ నాయకత్వం,పాలసీల కారణంగా నేడు ప్రతీ రంగంలో భారత్ లో కంపెనీల స్థాపనకు అవకాశాలు పెరుగుతున్నాయని అభిప్రాయపడిన సీఎం

• వివిధ రంగాల్లో ప్రపంచ దిగ్గజ కంపెనీల ఆలోచనలు, తన అనుభవాలను పంచుకున్న టాటా సన్స్ చైర్మన్

• విశాఖలో టిసిఎస్ డెవల్మెంట్ సెంటర్, అమరావతి క్వాంటం వాలీ, కర్నూలులో తలపెట్టిన సోలార్ పవర్ ప్రాజెక్టుల పురోగతిపై చర్చ

• రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా చేపట్టే కార్యక్రమాల నిర్వహణ , టాటా ట్రస్ట్ నుంచి ప్రత్యేకంగా అధికారులను పంపి దీనిపై చర్చిద్దామని చెప్పిన చంద్రశేఖరన్

రాష్ట్రంలో టాటా గ్రూపు చేపట్టిన టూరిజం ప్రాజెక్టులు వేగవంతం చేయాలని కోరిన సీఎం

రాష్ట్రంలో మూడు స్పొర్ట్స్ సిటీలు నిర్మించే ఆలోచనలో ఉన్నామని ఈ రంగంలో పెట్టుబడులకు అవకాశాలను పరిశీలించాలని కోరిన సీఎం

రాష్ట్రంలో టాటా గ్రూప్ ప్రాజెక్టులను వేగవంతం చేయాలని కోరిన ముఖ్యమంత్రి

అన్నిటినీ సమీక్షించి ప్రాజెక్టుల పూర్తికి సహకరిస్తామన్న టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్

NO COMMENTS

Exit mobile version