కర్నూలు
కర్నూలు జిల్లా…సాంకేతికతతో నేరాల నియంత్రణ… కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు.• నేర నియంత్రణకు కఠినంగా వ్యవహరించాలి.
• మహిళల భద్రతకు గట్టి చర్యలు తీసుకోవాలి.• డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్ ల పై స్పెషల్ డ్రైవ్ చేపట్టాలి.• జిల్లా పోలీసు అధికారులతో నేర సమీక్షా సమావేశం .
నేరాల నియంత్రణ, పెండింగ్ కేసుల దర్యాప్తు, నేరస్థుల ను గుర్తించేందుకు సాంకేతికతను వినియోగించాలని కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ పోలీసు అధికారులకు ఆదేశించారు. ఈ సంధర్బంగా గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో జిల్లాలోని డిఎస్పీలు, సిఐలు, ఎస్సైల తో నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా ఎస్పీ పోలీసు అధికారులతో మాట్లాడుతూ…
శాంతి భద్రతల పరిరక్షణ, గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసులు, మర్డర్, ప్రాపర్టీ, చీటింగ్, రోడ్డు ప్రమాదాలు తదితర కేసులపై సమీక్షించారు. వాటి పరిష్కారానికి తగిన సూచనలు, సలహాలు అందించారు. మహిళల భద్రతకు గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి రోజూ రెండు గ్రామాలలో పర్యటించాలన్నారు. సమావేశాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.సచివాలయ గ్రామ, వార్డు మహిళా పోలీసులతో కలిసి సమన్వయంతో పని చేయాలన్నారు.
పోలీసుశాఖ గౌరవం పెంచేలా గట్టిగా పని చేయాలన్నారు.దొంగతనాలు, ప్రాపర్టీ కేసులు చేధించి , రికవరీలు పెంచాలన్నారు. కేసుల దర్యాప్తులను పకడ్బందీగా చేయాలన్నారు.కేసుల దర్యాప్తులలో నాట్ గ్రిడ్ సాంకేతికతను వినియోగించాలన్నారు.పోక్సో కేసులలో ఖచ్చితంగా 60 రోజులలోపు ఛార్జ్ షీట్ వేయాలన్నారు
.పోక్సో కేసులలో ఛార్జ్ షీట్ లు వేయకుండా అలసత్వం వహిస్తే ఛార్జ్ మెమోలు జారీ చేస్తామన్నారు.డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్ ల పై స్పెషల్ డ్రైవ్ చేపట్టి గట్టి చర్యలు తీసుకోవాలన్నారు.మిస్సింగ్ కేసులు, చీటింగ్ కేసులు, రోడ్డు ప్రమాదాలు, దొంగతనాల కేసులు, ఎస్సీ , ఎస్టీ కేసులు, ప్రాపర్టీ కేసుల గురించి అడిగి తెలుసుకున్నారు. కోర్టులో ఉన్న పెండింగ్ కేసులను త్వరగా ట్రయల్ కు వచ్చే విధంగా కృషి చేయాలన్నారు.
విజిబుల్ పోలీసింగ్ బాగా చేయాలన్నారు. కేసులను చేధించి బాధితులకు న్యాయం చేయాలన్నారు.పెండింగ్ కేసుల దర్యాప్తులను పకడ్బందీగా చేయించాలన్నారుగత నెలలో వివిధ కేసులలో ప్రతిభ కనబరచిన పోలీసు అధికారులు, సిబ్బందికి ఎస్పీ గారు ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు.
ఈ నేర సమీక్ష సమావేశంలో అడిషనల్ ఎస్పీలు హుస్సేన్ పీరా, లీగల్ అడ్వైజర్ మల్లికార్జున రావు, డిఎస్పీలు బాబు ప్రసాద్ , వెంకట్రామయ్య , దుర్గా ప్రసాద్, హేమలత, భార్గవి , సిఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.
