Home South Zone Telangana ట్రాఫిక్ ఇంటర్నెట్ అంతరాయాలపై స్థానికులతో కలిసి ధర్నా.|

ట్రాఫిక్ ఇంటర్నెట్ అంతరాయాలపై స్థానికులతో కలిసి ధర్నా.|

0

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : ఓల్డ్ ఆల్వాల్–సుచిత్ర ప్రధాన రహదారిపై ఉన్న TCS iON ఎగ్జామ్ సెంటర్ వల్ల స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్ర ఇబ్బందులపై స్పందిస్తూ, మల్కాజ్‌గిరి శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి  , కార్పొరేటర్  శాంతి శ్రీనివాస్ రెడ్డి, ఓల్డ్ ఆల్వాల్ కాలనీల జాయింట్ యాక్షన్ కààమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఫాదర్ బాలయ్య నగర్ ఫేజ్–1 & 2, రిట్రీట్ కాలనీ, తిరుమల ఎన్‌క్లేవ్ ఫేజ్–1 & 2, వెంకటరమణ కాలనీ, చంద్రపురి కాలనీ, మహాలక్ష్మి సాయి శ్రీనివాసం అపార్ట్‌మెంట్, ఓం శ్రీ సాయి నగర్ తదితర కాలనీల ప్రజలు మరియు వ్యాపారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ధర్నాలో ఎమ్మెల్యే  మాట్లాడుతూ,
“వెయ్యికి పైగా విద్యార్థులతో ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహిస్తూ, నివాస ప్రాంతంలో జామర్లు ఏర్పాటు చేయడం పూర్తిగా అన్యాయం. ఇంటర్నెట్, మొబైల్ నెట్‌వర్క్ పూర్తిగా నిలిచిపోవడం వల్ల వర్క్ ఫ్రం హోం చేసే వారు, అత్యవసర వైద్య సేవలు పొందాల్సిన వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు” అని ఆవేదన వ్యక్తం చేశారు.
పరీక్షల సమయంలో ఉదయం 7.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు ట్రాఫిక్ పూర్తిగా స్థంభించిపోతోందని, కాలనీల లోపలికి అనియంత్రితంగా వాహనాలు ప్రవేశించి ఇళ్ల ముందే పార్కింగ్ చేయడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే  పేర్కొన్నారు.

“నివాస–వాణిజ్య సమ్మేళనంలో నివాస ప్రాంతంలో ఎగ్జామ్ సెంటర్ నడపడం నిబంధనలకు విరుద్ధం. ప్రజలు 75కి పైగా ఫిర్యాదులు ప్రజావాణి, పోలీస్, జీహెచ్ఎంసీకి ఇచ్చినా చర్యలు లేకపోవడం దురదృష్టకరం” అని అన్నారు.
ఈ సమస్యపై ఇప్పటికే ట్రాఫిక్ పోలీస్ ఫిర్యాదు, ఎఫ్ఐఆర్, ఎన్‌హెచ్‌ఆర్‌సీ, ఎస్‌హెచ్‌ఆర్‌సీకి వినతులు ఇచ్చినప్పటికీ ఎటువంటి పరిష్కారం లేకపోవడాన్ని ఎమ్మెల్యే  తీవ్రంగా తప్పుబట్టారు.
“ప్రజల జీవన హక్కులను హరించేలా వ్యవహరిస్తే సహించేది లేదు. ఈ ఎగ్జామ్ సెంటర్‌ను వెంటనే నివాస ప్రాంతం నుంచి తొలగించే వరకు ప్రజలతో కలిసి పోరాటం చేస్తాను. అవసరమైతే ఉన్నతాధికారులు, ప్రభుత్వ స్థాయిలో ఈ అంశాన్ని లేవనెత్తుతాను” అని స్పష్టం చేశారు.
సమస్యను తక్షణమే పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని జేఏసీ నాయకులు హెచ్చరించారు.

ఈ యొక్క కార్యక్రమంలో ఎం.ఎస్. రెడ్డి – జేఏసీ కన్వీనర్ మరియు తిరుమల ఎన్‌క్లేవ్ అధ్యక్షులు
సుదర్శన్ రెడ్డి – రిట్రీట్ కాలనీ అధ్యక్షులు
డా. శ్రీనిధి రెడ్డి – ఉపాధ్యక్షులు, ఫాదర్ బాలయ్య నగర్
కిషోర్ – వెంకటరమణ కాలనీ మాజీ అధ్యక్షులు
రాయప్ప రెడ్డి – ఖజానాదారు, ఫాదర్ బాలయ్య నగర్
శివ్ ప్రసాద్ – ప్రధాన కార్యదర్శి, తిరుమల ఎన్‌క్లేవ్ బిఆర్ఎస్ నాయకులు వివిధ కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.
#sidhumaroju

NO COMMENTS

Exit mobile version