Home South Zone Telangana లోతుకుంటలో సందడిగా బాక్స్ క్రికెట్ టోర్నీ ముగింపు వేడుకలు.|

లోతుకుంటలో సందడిగా బాక్స్ క్రికెట్ టోర్నీ ముగింపు వేడుకలు.|

0

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  : లోతుకుంట లక్ష్మీ కళ మందిర్ థియేటర్ ఎదురుగా నిర్వాహకుడు కంది కంటి యశ్వంత్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కె.ఆర్.జి (లేట్ కందికంటి రవికుమార్ గౌడ్)  మెమోరియల్ తొలి బాక్స్ క్రికెట్ టోర్నమెంట్ క్లోజింగ్ సెర్మనీ కార్యక్రమం ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి మల్కాజ్‌గిరి శాసనసభ్యులు  మర్రి రాజశేఖర్ రెడ్డి  ముఖ్య అతిథిగా హాజరై, బాక్స్ క్రికెట్ మ్యాచ్‌లను తిలకించడంతో పాటు స్వయంగా క్రికెట్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ, యువత క్రీడల వైపు మొగ్గు చూపడం శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఇలాంటి క్రీడా కార్యక్రమాలు యువతలో క్రమశిక్షణ, ఐక్యత, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని అన్నారు.

అలాగే లేట్ కందికంటి రవికుమార్ గౌడ్  స్మృతిలో నిర్వహించిన ఈ టోర్నమెంట్ అభినందనీయమని, క్రీడల ద్వారా వారి జ్ఞాపకాన్ని నిలుపుకోవడం గొప్ప విషయమని ఎమ్మెల్యే  తెలిపారు. విజేతలకు మరియు పాల్గొన్న క్రీడాకారులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో అల్వాల్ కార్పొరేటర్  శాంతి శ్రీనివాస్ రెడ్డి గారు, టీఆర్‌ఎస్ నాయకులు శ్రీ అనిల్ కిషోర్ గౌడ్, నేమూరి శ్రీధర్ గౌడ్, అరుణ్ రావు, బీఆర్ఎస్ నాయకులు, క్రీడాకారులు, యువకులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

#sidhumaroju

NO COMMENTS

Exit mobile version