అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. పోతబోలు హరిజనవాడకు చెందిన సురేంద్రబాబు భార్య (30) తన కుమార్తె మౌనిక మూడు రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందడంతో తీవ్ర మనోవేదనకు గురైంది.
ఈ బాధను తట్టుకోలేక ఆదివారం నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది. సమాచారం అందుకున్న అవుట్‌పోస్ట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
