పెద్దమండ్యం మండల విద్యాశాఖాధికారి మనోహర్‌కు విధి నిర్వహణలో ఉత్తమ సేవలందించినందుకు గాను జిల్లా ఉత్తమ ఎంఈఓగా ఎంపికయ్యారు.
సోమవారం రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లెలో జిల్లా కలెక్టర్, విద్యాశాఖ ఉన్నతాధికారుల చేతులమీదుగా ఆయనకు ప్రశంసాపత్రం, మెమెంటో అందజేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ అవార్డు ఆయన నిబద్ధతకు, అంకితభావానికి నిదర్శనం.
