77వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా సోమవారం అన్నమయ్య జిల్లా మదనపల్లి కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించిన అనంతరం, మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. దేశ స్వాతంత్ర్యం కోసం త్యాగాలు చేసిన మహనీయుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని, ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో దేశ అభివృద్ధికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
